జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ తిరిగి మొదలుకాబోతోంది. ఆ మధ్య వేరొక సినిమా గురించి వచ్చిన పుకార్లను దీనికి అన్వయించుకున్న కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో హడావిడి చేశారు కానీ తర్వాత అసలు నిజం తెలిసి సైలెంటయ్యారు. అయితే డ్రాగన్ ని రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ తీయాలని నిర్ణయించుకున్నట్టు ఒక అనఫీషియల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటిదాకా షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుందని, మొదటి భాగానికి సంబంధించిన కంటెంట్ ని కొత్త షెడ్యూల్, కొత్త గెటప్ లో తీయబోతున్నారని సమాచారం.
ఇది బాగానే ఉంది అక్కడ దేవర 2 కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు. తారక్ రావడం ఆలస్యం వేగంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. కాకపోతే ఫైనల్ గా ఓకే అనుకుంటే ఆర్టిస్టుల కాల్ షీట్లు తీసుకోవాలి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఇలా అనుకోగానే అలా డేట్లు దొరకవు. ఎంతలేదన్నా ఆరు నెలల ముందే ప్లానింగ్ ఉండాలి. పైగా తారాగణమంతా చాలా బిజీగా ఉన్నారు. ముందస్తుగా చెప్పకుండా అప్పటికప్పుడు కాల్ షీట్లు ఇవ్వమంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.
దేవర 2 ఉంటుందా లేదా అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే తారక్ పుట్టినరోజుకు పోస్టర్ తో పాటు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి కొరటాల శివ ఒకవేళ ఆలస్యమయ్యే పక్షంలో ఇంకో సినిమా తీస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి దర్శకత్వం కాకుండా తన నిర్మాణంలో కొన్ని సినిమాలు తీసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. వాటిలో నాగచైతన్యది కూడా ఉందట. కాకపోతే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాగా సీక్వెల్స్ ఏవైనా సరే రెండు మూడేళ్ళలోపే వచ్చేయాలి. లేదంటే మొదటి భాగం బజ్ తగ్గిపోయే రిస్క్ ఉంటుంది. మరి దేవర 2 ఎప్పుడు సెట్స్ లో అడుగు పెడతాడో చూడాలి.
This post was last modified on November 7, 2025 10:29 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…