జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేస్తారనేది పాత వార్త. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మొదటి భాగంలోనే నటింపజేయడానికి ప్రయత్నించారు కానీ సఫలీకృతం కాలేదు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ ని తెచ్చినట్టే తెలుగు నుంచి బాలయ్య ఉంటే బ్యాలన్స్ అవుతుందని అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల నెరవేరలేదు. కట్ చేస్తే జైలర్ 2లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే స్పెషల్ క్యారెక్టర్ ని బాలకృష్ణతో చేయిస్తారనే ప్రచారం నెలల క్రితమే జరిగింది. కానీ బాలయ్య సున్నితంగా నో చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి.
రజనీకాంత్, బాలకృష్ణల మధ్య మంచి స్నేహం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ప్రదర్శించే తలైవర్ ఈ కారణంగానే శతజయంతి ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా వచ్చారు. అయితే జైలర్ 2లో డిజైన్ చేసిన పాత్ర బాలయ్యని ఎలివేట్ చేయడం కన్నా రజని క్యారెక్టర్ ని హైలైట్ చేసే విధంగా ఉండటంతో వద్దనుకున్నారని ఇన్ సైడ్ టాక్. అఖండ నుంచి డాకు మహారాజ్ దాకా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టైంలో క్యామియోలు లాంటివి వద్దని ఆయన కూతురు తేజస్విని సలహా ఇవ్వడం వల్లే ఈ డెసిషన్ తీసుకున్నట్టు చెబుతున్నారు. నిజమెంతో కానీ ఒకరకంగా ఇది సరైన నిర్ణయమే.
ఎందుకంటే ఫస్ట్ జైలర్ లో అతిధి పాత్రలు రజనిని ఎలివేట్ చేయడానికే ఎక్కువ ఉపయోగపడ్డాయి. కానీ బాలకృష్ణ అలా చేస్తే అభిమానులు అంత సులభంగా అంగీకరించకపోవచ్చు. గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా లాంటివి చేసిన బాలయ్య దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోవడంతో క్యామియోలకు దూరంగా ఉన్నారు. అందుకే జైలర్ 2కి నో చెప్పి ఉండొచ్చని టాక్. ఆయన స్థానంలో ఫహద్ ఫాసిల్ ని తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అతను ఉన్న మాట నిజమే కానీ అది బాలయ్య వద్దని చెప్పిన పాత్ర కోసమా లేక మరొకటా అనేది తెలియాల్సి ఉంది. 2026 వేసవి రిలీజ్ టార్గెట్ గా జైలర్ 2 పనులు జరుగుతున్నాయి.
This post was last modified on November 5, 2025 11:12 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…