ఈ వారం విడుదలవుతున్న వాటిలో బడ్జెట్ పరంగా పెద్ద సినిమా జటాధరనే. సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ హారర్ కం డివోషనల్ డ్రామా కోసం బాలీవుడ్ నిర్మాతలు గట్టిగానే ఖర్చు పెట్టారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు మనసు విప్పి మాట్లాడిన నిజాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. లేనిపోని భేషజాలు హీరోయిజం చూపించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేసి తను ఎంత కష్టపడింది చెప్పుకొచ్చాడు. అయితే జటాధరకు బయట పెద్దగా బజ్ లేదు. ట్రైలర్ విజువల్స్ బాగానే ఉన్నా జనాలకు పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయాయి.
ఈ నేపథ్యంలో దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సుధీర్ బాబుకి బాక్సాఫీస్ వద్ద జటిలమైన పరీక్షే ఎదురు కానుంది. ఎందుకంటే జటాధరా సోలోగా రావడం లేదు. కాంపిటీషన్ లో రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ ఉంది. దీని మీద హీరోయిన్ ఇమేజ్, జానర్ ఎఫెక్ట్ వల్ల ఓ మోస్తరు బజ్ ఉంది. విష్ణు విశాల్ డబ్బింగ్ మూవీ ఆర్యన్ మీద హైప్ రావడం అనుమానమే. తిరువీర్ ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా హైప్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. సో ఎలా చూసుకున్నా మాస్ ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయస్ అయ్యేందుకు జటాధరాకు అవకాశాలున్నాయి. కాకపోతే టాక్ పాజిటివ్ గా రావాల్సిన అవసరం చాలా ఉంది.
ఇది కనక నెగ్గితే సుధీర్ బాబుకి మళ్ళీ మార్కెట్ ఓపెనవుతుంది. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. హరోంహర ఒకటే కొంచెం పర్వాలేదనిపించుకుంది కానీ మరీ అద్భుతాలేం చేయలేదు. సో జటాధరా సక్సెస్ అయితే తిరిగి అవకాశాలు ఊపందుకుంటాయి. ఈసారి మహేష్ బాబు మద్దతు తీసుకోకుండా స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్న సుధీర్ బాబు ఇతర బాషల డబ్బింగ్ వెర్షన్ల మీద కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సోనాక్షి సిన్హా విలన్ కం హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న జటాధరకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
This post was last modified on November 3, 2025 10:15 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…