తమ సినిమాల గురించి పాజిటివ్‌గా మాట్లాడ్డం వరకు ఓకే. కొంచెం ఎగ్జాజరేట్ చేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ అత్యుత్సాహంతో భారీ స్టేట్మెంట్లు ఇస్తేనే చాలా కష్టమవుతుంది. రిలీజ్‌కు ముందు అలాంటి స్టేట్మెంట్లు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్‌ను తెలియజేయొచ్చు. ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేకెత్తించవచ్చు. కానీ ఏదైనా తేడా కొడితే.. డ్యామేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ కామెంట్లు ట్రోల్ మెటీరియల్‌గా మారతాయి. సినిమాకు చేటు చేస్తాయి.
ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనకు తలనొప్పిగా మారేలా ఉంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ కాకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఐతే రాజేంద్ర ప్రసాద్ పాజిటివ్ కోణంలో ‘షాక్’ అవుతారు అంటే.. ఆడియన్స్ ఇంకో రకంగా షాకయ్యారు. ఈ రోజుల్లో ఇంత రొటీన్ సినిమా తీసి మెప్పించగలమని ఎలా అనుకున్నారు అనుకుంటూ షాకవుతున్నారు.
అసలు రాజేంద్ర ప్రసాద్ పాత్రలో ఏమంత విషయం ఉందని అంత ఎగ్జైట్ అయ్యారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా సినీ జనాలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇబ్బంది పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో విశ్వక్సేన్ ‘పాగల్’ అనే సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమాకు జనం లేక తొలి వారంలోనే షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నేచురల్ స్టార్ నాని ‘కోర్టు’ మూవీ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటించే తర్వాతి సినిమాను చూడొద్దని అన్నాడు. కానీ ఆ సినిమా హిట్టయి నాని మాటకు విలువ చేకూర్చింది. ఐతే కానీ ‘కోర్టు’లో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి.. నానిని అనుకరిస్తూ ‘మిత్రమండలి’ సినిమా విషయంలో సేమ్ ఇలాంటి ఛాలెంజే విసిరాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందుకే సినిమాకు హైప్ ఇవ్వడం కోసం మరీ పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం మంచిది.
This post was last modified on November 2, 2025 7:17 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…