‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను థియేటర్లలో, టీవీల్లో ఓటీటీల్లో ఎన్నోసార్లు చూసినా సరే.. ఈ రెండు చిత్రాలనూ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తే మళ్లీ ఎగబడి చూస్తున్నారు మన ప్రేక్షకులు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది.
కొత్త సినిమా రిలీజైనంత సంబరం కనిపిస్తోంది థియేటర్లలో. చూసిన వాళ్లంతా ఈ అనుభూతి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మంచి థియేటర్‌కు వెళ్లి తప్పకుండా ఈ సినిమా చూడాలని అభిప్రాయపడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ‘బాహుబలి’ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపబోతోందనే సంకేతాలు కనిపించాయి. శుక్రవారం ఫస్ట్ షో నుంచి ప్రేక్షకులను పలకరించిన రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’ను మించి దీనికి స్పందన కనిపించింది.
ఐతే ‘బాహుబలి: ది ఎపిక్’ను తెలుగు వాళ్లు ఆదరిస్తున్నట్లు మిగతా భాషల ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ‘ది ఎపిక్’ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే భారీగా రిలీజైంది. ఇతర భాషల్లో రిలీజ్, రెస్పాన్స్ ఓ మోస్తరుగా అనిపిస్తున్నాయంతే. హిందీలో శుక్రవారం సినిమాకు ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేవు. ఇండియాలో ఈ చిత్రం తొలి రోజు రూ.10 కోట్ల దాకా నెట్ కలెక్ట్ చేస్తే.. అందులో రూ.8 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. హిందీ వసూళ్లు కోటిన్నర లోపే ఉన్నాయి. యుఎస్‌లో సైతం తెలుగు వెర్షన్‌కు అద్భుత స్పందన రాగా.. హిందీ వెర్షన్‌కు రెస్పాన్స్ తక్కువగానే ఉంది. తమిళంలో అయితే ఈ సినిమా నామమాత్రంగా రిలీజైంది.
‘బాహుబలి’ని అప్పట్లో తమిళులు బాగా ఆదరించారు కానీ.. ఇప్పుడు రీ రిలీజ్ విషయంలో వాళ్లు పెద్దగా ఆసక్తి లేనట్లే కనిపిస్తోంది. తమిళం మీద మేకర్స్‌కు కూడా పెద్దగా ఆశలు లేనట్లే కనిపిస్తోంది. కానీ హిందీలో బాగా ఆడుతుందని భావిస్తున్నారు. ఐతే హిందీ ఆడియన్స్ సౌత్ సినిమాల విషయంలో ఆరంభంలో నెమ్మదిగానే స్పందిస్తారు. కనెక్ట్ అయితే లాంగ్ రన్ ఉంటుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైనపుడు కూడా అలాగే జరిగింది. ‘ది ఎపిక్’ విషయంలోనూ వాళ్లు నెమ్మదిగా థియేటర్లకు కదులుతారని.. వాళ్లు కనెక్ట్ అయితే సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వస్తున్నారు.
This post was last modified on November 1, 2025 2:30 pm
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…