బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాకు ఒక టార్చ్ బేరర్‌గా మారాడు రాజమౌళి. ఎంత భారీ కలనైనా కని.. దానికి సరైన రూపం ఇస్తే బాక్సాఫీస్ దగ్గర అసాధారణ ఫలితాలు రాబట్టవచ్చని ఆ సినిమాతో రుజువు చేశాడు జక్కన్న. బాక్సాపీస్ దగ్గర ఆ సినిమా సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మరోసారి బాహుబలి టీం ట్రెండ్ సెట్ చేస్తోంది. బాహుబలి: ది బిగినింగ్, ది కంక్లూజన్ చిత్రాలు రెంటినీ కలిపి ది ఎపిక్ పేరుతో ఒక సినిమాగా ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఈ సినిమాకు మంచి స్పందనే ఉంటుందనుకున్నారు కానీ.. అంచనాలను మించిన రెస్పాన్సే వస్తోంది. కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది బాహుబలి: ది ఎపిక్. పదేళ్ల తర్వాత కూడా బాహుబలి ఇలాంటి అద్భుతం చేయడం అనూహ్యం. ఈ ఊపు చూశాక ఇలాంటి ప్రయోగం వేరే చిత్రాలు ఎందుకు చేయకూడదనే చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా పుష్ప సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.
పుష్పను మొదలుపెట్టినపుడు దాన్ని ఒక సినిమాగానే తీయాలనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మారింది. బాహుబలిని అనుసరిస్తూ ఒక కథను రెండు భాగాలు చేశాడు సుకుమార్.. ఇప్పుడు బాహుబలి రెండు భాగాలను కలిపి ఒక చిత్రంగా అందించాలన్న ప్రయత్నం విజయవంతం కావడంతో పుష్ప టీం కూడా ఇదే బాటలో నడిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా అంతటి యుఫోరియా క్రియేట్ చేసిన మూవీ పుష్ప. నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
పుష్ప రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా అందిస్తే అక్కడి ప్రేక్షకులు బాగానే ఆదరించే అవకాశముంది. తెలుగు ప్రేక్షకులు ఎలాగూ ఈ సినిమాను బాగానే చూస్తారనడంలో సందేహం లేదు. కాకపోతే ఇప్పుడే ఆ పని చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లు గడిచాక ఈ ప్రయత్నం చేస్తే మంచి ఫలితం దక్కే అవకాశముంది. మరి సుకుమార్ అండ్ టీం భవిష్యత్తులో బాహుబలి బాట పడుతుందేమో చూడాలి.
This post was last modified on October 31, 2025 11:11 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…