‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌కు శ్రీకారం చుట్టాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాకు ముందు ప్రశాంత్ చిన్న స్థాయి దర్శకుడే. పెద్ద సక్సెస్‌లేమీ లేవు. దీంతో పోస్టర్ మీద పీవీసీయూ అని చూసి ఇది మరీ అతిగా ఉందే అనుకున్నారు చాలామంది. కానీ ‘హనుమాన్’తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కొట్టి తనేంటో చూపించాడు ప్రశాంత్. తర్వాత అందరికీ పీవీసీయూ పట్ల అమితాసక్తి వ్యక్తమైంది.
ఐతే ఇందులో భాగంగా మోక్షజ్ఞతో చేయాలనుకున్న సినిమా ముందుకు కదల్లేదు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ కూడా ఆలస్యం అవుతోంది. మరి ఈ యూనివర్శ్ ఎప్పుడు ముందుకు కదులుతుందో అని అందరూ చూస్తున్నారు. ఐతే ‘మహాకాలి’ రూపంలో పీవీసీయూలో రెండో సినిమా సెట్స్‌పైకి వెళ్లిపోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న చిన్నమ్మాయి ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది కూడా క్రేజీగా ఉంది. ‘హనుమాన్’కు ఫాలో అప్‌గా మరో క్రేజీ ప్రాజెక్టునే రెడీ చేస్తున్నట్లున్నాడు ప్రశాంత్. ఈ సినిమాకు అతను కథకుడు మాత్రమే. దర్శకత్వ బాధ్యతలను పూజ అపర్ణ కొల్లూరుకు అప్పగించారు.
భారీ వీఎఫెక్స్‌తో విజువల్ వండర్‌లా తీర్చిదిద్దాలనుకుంటున్న ఇలాంటి సినిమా బాధ్యతలను ఒక చిన్న సినిమా తీసిన, లేడీ డైరెక్టర్ చేతిలో పెట్టడం ఆశ్చర్యమే. పూజ ఇంతకుముందు సంపూ హీరోగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తీసింది. అది తమిళ హిట్ ‘మండేలా’కు రీమేక్. చాలా తక్కువ బడ్జెట్లో తీశారు. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘మార్టిన్ లూథర్ కింగ్’ బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. అలాంటి సినిమాతో పరిచయం అయిన దర్శకురాలిని నమ్మి పెద్ద బడ్జెట్లో ‘మహాకాళి’ తీస్తున్నారు నిర్మాతలు. ఐతే వెనుక ప్రశాంత్ వర్మ ఉన్నాడనే ధైర్యం నిర్మాతలది కావచ్చు. మరి ఈ సినిమాతో పూజ దర్శకురాలిగా ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
This post was last modified on October 30, 2025 5:11 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…