టాలీవుడ్లో ఇప్పుడో ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. విశ్వక్సేన్ హీరోగా నాని నిర్మాణంలో కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్’ సినిమా సీక్వెల్‌లో శేష్ ప్రధాన పాత్ర పోషించనున్నాడట. విశ్వక్సేన్ అందుబాటులో లేకపోవడమో, మరో కారణంతోనో శేష్ లీడ్ రోల్‌ను టేకప్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. కానీ ఈ వార్త ఎంత వరకు నిజం, ఈ సినిమా శేష్‌కు కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాలీవుడ్లో థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హీరో శేష్. అతను చేసిన ప్రతి థ్రిల్లర్ సినిమా కూడా ఒక సెన్సేషనే. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అతను ట్రెండ్ సెట్ చేశాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. అందరూ మన వైపు చూసేలా చేశాడు. ఇప్పుడు అతను చేస్తున్న ‘మేజర్’, ‘గూఢచారి’ సినిమాలు సైతం థ్రిల్లర్ కథలతో తెరకెక్కతున్నవే. వీటి మీదే శేష్ ఫోకస్ అంతా ఉంది. ఇప్పటిదాకా చేసిన, చేయబోయే సినిమాలన్నింట్లో శేష్ ముద్ర ప్రత్యేకమైంది. ఆ సినిమాలకు అన్నీ తానై వ్యవహరించాడు శేష్. ఈ సినిమాల్లో అతడి బ్రాండ్ ఉంది.
ఐతే ‘హిట్’ అనేది వేరే హీరో నటించిన సినిమా. సీక్వెల్‌కు ఆల్రెడీ స్క్రిప్టు పూర్తయింది. అందులో శేష్ భాగస్వామ్యం ఏమీ లేదు. తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నపుడు వేరే హీరో షూస్‌లోకి శేష్ దూరాల్సిన అవసరమేంటి అన్నది ప్రశ్న. తాను చేస్తున్న థ్రిల్లర్లు చాలవని ‘హిట్’లోకి కూడా దూరిపోతే జనాలకు మొహం మొత్తేస్తుందేమో.. జనాలు ఆల్రెడీ విశ్వక్సేన్‌కు అలవాటు పడ్డ నేపథ్యంలో ‘హిట్’ సీక్వెల్ కూడా అతనే చేస్తే భిన్నంగా ఉంటుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా విశ్వక్సేన్ తన కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే.. తనకో బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టే ‘హిట్’ ఫ్రాంచైజీని ఎందుకు వదులుకున్నాడన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘హిట్’ సీక్వెల్లో శేష్ నటించబోతున్నాడనే వార్త అయితే జనాలను అనుకున్నంతగా ఎగ్జైట్ చేయట్లేదు.
This post was last modified on November 30, 2020 2:02 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…