Movie News

జాన్వీ ఘట్టమనేని – అమ్మ లక్ష్యం కోసం వారసురాలు

స్టార్ హీరోల కొడుకులు వచ్చినంత వేగంగా కూతుళ్లు మేకప్ వేసుకుని తెరమీదకు రారనేది నగ్న సత్యం. శృతి హాసన్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపులా నిలుస్తారు కానీ, బాలీవుడ్ ఖాన్లు కపూర్ల కుటుంబాల నుంచి హీరోయిన్లు వచ్చినంత ఫాస్ట్ గా మన దక్షిణాదిలో ఉండదు. కానీ ఇప్పుడీ ట్రెండ్ క్రమంగా మారేలా ఉంది. మహేష్ బాబు మేనకోడలు, ఆయన అక్క మంజుల కూతురు జాన్వీ ఘట్టమనేని ఎంట్రీలకి రంగం సిద్ధమవుతున్నట్టుగా వస్తున్న వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కొన్ని కీలకమైన విషయాలు ఆసక్తి గొలిపేలా అనిపిస్తాయి.

90 దశకంలో సూపర్ స్టార్ కృష్ణ తన కూతురు మంజులని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నించారు. ఆమెకూ ఆసక్తి ఉండటంతో దానికి సంబంధించి ప్రయత్నాలు జరిగాయి. బాలకృష్ణ టాప్ హీరోలో జోడిగా మంజులనే అడిగారని అప్పటి పత్రికల్లో వచ్చింది. అయితే కృష్ణ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. గ్లామర్ ఫీల్డ్ కి అమ్మాయిని దూరంగా ఉంచమని కోరడంతో కృష్ణ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించారు. ఆ తర్వాత మంజుల షో లాంటి ఒకటి రెండు సినిమాలు చేసి, దర్శకత్వం ట్రై చేసి, ఆ తర్వాత పోకిరితో ప్రొడ్యూసర్ గా మారి కొంత కాలం బిజీ అయ్యారు. భర్త సంజయ్ స్వరూప్ రెగ్యులర్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తారు.

ఇప్పుడు జాన్వీ ఘట్టమనేనికి రంగం సిద్ధం కావడం చూస్తుంటే అమ్మ నెరవేర్చుకోలేని లక్ష్యం ఇప్పుడు కూతురు రూపంలో తీర్చుకోబోతున్నారన్న మాట. అయితే అప్పటిలా పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి అభిమానులు నో అనే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ రమేష్ బాబు కూతురు భారతి కూడా ఎంట్రీ ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఓ నాలుగైదేళ్ల తర్వాత మహేష్ తనయురాలు సితార కూడా తెరమీద కనిపించినా ఆశ్చర్యం లేదు. మహేష్ బాబు, సుధీర్ బాబు ల తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి జయకృష్ణ, చరిత్, దర్శన్, గౌతమ్ ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్ రంగప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

This post was last modified on October 29, 2025 1:16 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

4 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

21 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

44 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago