Movie News

ఫ్యామిలీ మ్యాన్-3.. డేట్ వచ్చేసింది కానీ…

ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ను ముందు వరుసలో చెప్పుకోవచ్చు. దీన్ని మించిన భారీ సిరీస్‌లు చాలా ఉన్నాయి కానీ.. కంటెంట్ క్వాలిటీ, ప్రేక్షకాదరణ పరంగా చూస్తే ఇదే నంబర్ వన్ స్థాయిలో నిలుస్తుంది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంది.

తర్వాత రెండో సీజన్ రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయింది. సెకండ్ పార్ట్‌లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండో సీజన్ చివర్లో మూడో సీజన్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేరే కమిట్మెంట్ల వల్ల రాజ్-డీకే కొంచెం గ్యాప్ తీసుకుని.. గత ఏడాది దీని షూట్ మొదలుపెట్టారు. ఈ మధ్యే చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాదే స్ట్రీమింగ్ కూడా ఉంటుందని టీం క్లారిటీ ఇచ్చింది. ఐతే డేట్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దాని గురించి కూడా క్లారిటీ వచ్చేసింది.

నవంబరు 21 నుంచి అమేజాన్ ప్రైమ్ ‘ఫ్యామిలీ మ్యాన్-3’ని స్ట్రీమ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థ్రెట్ అండ్ అనాలసిస్ అండ్ సర్వేలెన్స్ సెల్ (టాస్క్) సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్‌పేయి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఈసారి కథను నార్త్ ఈస్ట్‌కు తీసుకెళ్లబోతున్నారు.

ఇండియా మీద చైనా సైబర్ ఎటాక్ చేస్తే.. దానికి కౌంటర్‌గా హీరో అండ్ టీం చేసిందనే కథాంశంతో సినిమా తెరకెక్కనుంది. ఈసారి ‘ఫ్యామిలీ మ్యాన్’లో కాస్టింగ్ కూడా భారీగా ఉండబోతోంది. ‘పాతాళ్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ ఇందులో కీలక పాత్ర‌లో కనిపించనున్నాడు. శ్రేయా ధన్వంతరి, సన్నీ హిందుజా, అభయ్ వర్మ కూడా కొత్తగా సిరీస్‌లోకి రాబోతున్నారు. ఇక ప్రియమణి, అశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్ లాంటి రెగ్యులర్ ఆర్టిస్టులు ఎలాగూ ఉంటారు. ‘ఫ్యామిలీ మ్యాన్-3’ రాకతో ఇండియన్ వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్ రికార్డులన్నీ బద్దలవుతాయని భావిస్తున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లు అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైన సందర్భాలు చూసాం. మరి ఫ్యామిలీ మ్యాన్ 3 ఆ కోవలోకే చేరుతుందా లేదా ప్రేక్షకుల మన్నలను పొందుతుందా అనేది వేచి చూడాలి.

This post was last modified on October 28, 2025 6:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

3 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

6 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago