కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతారకు అక్కడి అగ్ర హీరోలు అవకాశాలు తగ్గించేశారు కానీ తెలుగులో మాత్రం మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. సైరా, గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ తో నటించినప్పటికీ అప్పుడు రాని మెగా గుర్తింపు ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారుతో వచ్చేలా ఉంది. మీసాల పిల్ల సాంగ్ కు దక్కుతున్న రెస్పాన్స్ అదే స్పష్టం చేస్తోంది. రెగ్యులర్ హీరోయిన్ వేషం కాకుండా భర్తతో విడిపోయిన మాజీ ఇల్లాలుగా చిరుతో కాంబినేషన్ సీన్లు, వెంకటేష్ తో స్క్రీన్ షేరింగ్ ఓ రేంజ్ లో పండుతున్నాయాని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగానే నయనతార మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యిందని ఫిలిం నగర్ టాక్.
వీరసింహారెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కబోయే పీరియాడిక్ డ్రామాలో కథానాయికగా నయన్ ని ఎంపిక చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. నవంబర్ 7 ప్రారంభోత్సవం చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లే ప్లాన్ లో ఉన్నారట. అప్పటికంతా వరప్రసాద్ చిత్రీకరణ అయిపోతుంది కాబట్టి డేట్లకు సంబంధించిన సమస్య రాదు. బాలయ్య, నయనతార ఇప్పటిదాకా మూడుసార్లు తెరను పంచుకున్నారు. శ్రీరామ రాజ్యం, సింహ, జై సింహ మూడు చెప్పుకోదగ్గ సినిమాలే. ఇప్పుడు నాలుగోసారి కలయికను రిపీట్ చేయడమంటే ఫ్యాన్స్ కి హ్యాపీనే.
కథకు సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ బయటికి రాలేదు కానీ ఒకప్పటి రాజవంశాలు బ్యాక్ డ్రాప్ లో చాలా టెర్రిఫిక్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట గోపీచంద్ మలినేని. బడ్జెట్ కాస్త ఎక్కువే డిమాండ్ చేయడంతో ఓటిటి పార్ట్ నర్ ను లాక్ చేసుకోవడంలో జరిగిన ఆలస్యం వల్ల ఓపెనింగ్ జాప్యం చేశారని ఇన్ సైడ్ టాక్. ఫ్యాక్షన్ ఛాయలు లేకుండా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణని సరికొత్తగా చూపబోతున్నట్టు తెలిసింది. నయన్ ఎంపిక ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం క్యాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మలినేని టీమ్ చాలా బిజీగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates