కన్నడ సినిమాలో ఆల్ టైం గ్రేట్ రాజ్ కుమార్ తనయుడిగా అరంగేట్రం చేసి.. అక్కడి టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగిన శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ఆయన గతంలో రామ్ గోపాల్ వర్మతో కిల్లింగ్ వీరప్పన్ సినిమా చేశారు. ఆపై నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో క్యామియో చేశారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్దిలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ లీడ్ రోల్‌లో తెలుగులో ఓ సినిమా అనౌన్స్ అయింది. అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేదే.
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతోంది..అందులో గుమ్మడి నర్సయ్యగా కనిపించబోయేది శివరాజ్‌కుమారే. ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ కాన్సెప్ట్ కూడా బాగుంది. గుమ్మడి నర్సయ్య సాధారణ జీవనాన్ని, ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు.
పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఆయన సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఆడంబరాలకు పోలేదు. పదవిలో ఉన్నపుడు, ఆ తర్వాత ఆయనది సాధారణ జీవితమే. ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు.. మందీ మార్బలం లేకుండా ఒక్కడే జనాల మధ్య తిరుగుతుంటారు. పేదలు, గిరిజనుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇలాంటి నాయకుడి కథను కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్‌తో తెరకెక్కించనుండడం ఆశ్చర్యం కలిగించేదే.
This post was last modified on October 23, 2025 9:16 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…