కాంతార అనే లో బడ్జెట్ రీజనల్ మూవీ.. మూడేళ్ల కిందట దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం.. తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలై ఎవ్వరూ ఊహించని విధంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసి రిలీజ్ చేశారు. ఇది అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. ఇప్పటికే రూ.700 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది కాంతార: ది చాప్టర్-1.
ఐతే ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘ఛావా’ను ‘కాంతార: చాప్టర్-1’ అధిగమిస్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. హిందీ మూవీ ‘తామ’ వల్ల ఉత్తరాదిన ‘కాంతార’ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దక్షిణాదిన కూడా సినిమా బాగా స్లో అయ్యాయి. కాబట్టి రూ.800 కోట్ల ఘనతను అందుకోవడం కష్టంగానే ఉంది.
ఐతే 2025 నంబర్ వన్ గ్రాసర్ రికార్డును అందుకోవడం కోసం ‘కాంతార’ మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు.
ఈ చిత్రాన్ని కొత్తగా ఇంగ్లిష్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 31నే ఇంగ్లిష్ వెర్షన్ విడుదల కాబోతోంది. త్వరలో హీరో రిషబ్ శెట్టి అండ్ టీం విదేశాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నేటివ్ అమెరికన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో తర్వాత థియేటర్లలోనూ కొన్ని స్పెషల్ షోలు వేయడం తెలిసిందే. ‘కాంతార’ సైతం అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే పొటెన్షియాలిటీ ఉన్న సినిమా అని టీం భావిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాగే ఇది కూడా అక్కడి వాళ్లను ఆకట్టుకుంటే.. ఓవరాల్ వసూళ్లు పెరిగి రూ.800 కోట్ల క్లబ్బులోకి ఈ సినిమా అడుగుపెడుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on October 22, 2025 4:25 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…