‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు సనా. తన దర్శకత్వ ప్రతిభ చూసి ఇండస్ట్రీ షాకైపోయింది. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. దీన్ని కూడా అతను సద్వినియోగం చేసుకునేలాగే కనిపిస్తున్నాడు. ‘పెద్ది’కి సంబంధించి ప్రోమోలన్నీ చాలా ఎగ్జైటింగ్‌గా ఉండి సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఐతే మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కాగా.. ముందు రోజు శ్రీరామనవమి కావడంతో ఆ రోజే ‘పెద్ది’ని రిలీజ్ చేయాలని టీం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘పెద్ది’ షూట్ మంచి ఉత్సాహంతో సాగిపోతున్న సమయంలో టీంలో చిన్న డిస్టర్బెన్స్ మొదలైనట్లు సమాచారం. ‘పెద్ది’ సినిమాయే లోకంగా బతుకుతున్న బుచ్చిబాబు అనారోగ్యం పాలయ్యాడట. రేయింబవళ్లు సినిమా మీదే ధ్యాస పెట్టిన అతను.. సరిగా తిండి తినక, నిద్ర పోక అస్వస్థతకు గురయ్యాడట.
మనిషి మామూలుగానే వీక్‌గా కనిపిస్తాడు. ఇక తిండి, నిద్ర గురించి పట్టించుకోకపోవడంతో అతను మరింత బలహీనంగా తయారయ్యాడని.. ఈ విషయం రామ్ చరణ్‌కు తెలియడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపించాడని అంటున్నారు. ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పి బుచ్చిబాబుకు విశ్రాంతి ఇప్పించారని.. తర్వాత షూటింగ్ పున:ప్రారంభం అయిందని టీం వర్గాలు చెబుతున్నాయి. కానీ బుచ్చిబాబు ఇంకా వీక్‌గానే ఉన్నాడట. అతడి డెడికేషన్ చూసి టీం అంతా ఆశ్చర్యపోతోందని.. కచ్చితంగా చరణ్‌కు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే తపనతో అతను పని చేస్తున్నాడని తెలిసి మెగా అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on October 20, 2025 5:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…