అభిమానులు అనుష్కని రెగ్యులర్ గా తెరమీద చూడాలని కోరుకుంటున్నారు కానీ తను మాత్రం రెండు మూడేళ్ళకో సినిమా చేస్తూ కనీసం ప్రమోషన్ల కోసమైనా దర్శనమివ్వకుండా దోబూచులాడుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ రెండింటిలోనూ ఇది అనుభవమయ్యింది. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ఇంటర్వ్యూలలో కనిపిస్తుందని అంటున్నారు కానీ వీడియో బయటికి వస్తే తప్ప నిజమని నమ్మే పరిస్థితి లేదు. అలాని అనుష్కతో తీయడానికి నిర్మాతలు రెడీగా లేరని కాదు. భాగమతి 2తో సహా ఎందరో రైటర్లు డైరెక్టర్లు ఆమెను కలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దర్శనం చిక్కితేగా.
నాగార్జున వందో మూవీ ఆర్ కార్తీక దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో టబుని ఆల్రెడీ ఒక కీలక పాత్రకు లాక్ చేశారని టాక్ ఉంది. మెయిన్ హీరోయిన్ గా ఇప్పుడు అనుష్కని అడుగుతున్నారని లేటెస్ట్ అప్డేట్. నిజానికి నాగ్ అంటే స్వీటీకి చాలా అభిమానం. సూపర్ తో ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉంది. ఆ కారణంగానే ఇష్టం అయిష్టాలను పక్కన పెట్టి సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాల్లో క్యామియోలు చేసింది. ఇప్పుడీ నాగ్ 100 కోసం తనను సంప్రదిస్తే నో చెప్పకపోవచ్చు. అసలు అడిగారా అనేది ప్రశ్న. ఒకవేళ కన్ఫర్మ్ అయితే నాగ్ ఫ్యాన్స్ కు పండగే.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నాగార్జున 100కి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఒకప్పుడు ప్రభుత్వాలను తన చిటికెన వేలు మీద నడిపించిన ఒక లాటరీ డాన్ జీవితం ఆధారంగా ఇది రాసుకున్నారని తెలిసింది. అతనెవరనేది బయట పెట్టలేదు కానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ తొంభై దశకంలో ఉంటుందని అంటున్నారు. ఫైనల్ గా టబు, అనుష్క కనక నాగార్జున సరసన చేరితే వింటేజ్ వైబ్స్ రావడం ఖాయం. సోలో హీరోగా నా సామిరంగా తర్వాత మరో సినిమా చేయని నాగార్జున నుంచి సాలిడ్ ఎంటర్ టైనర్ వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. మరి ఈ ల్యాండ్ మార్క్ చిత్రం ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.
This post was last modified on October 17, 2025 2:39 pm
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…