సామజిక సమస్యలను తీసుకుని వయొలెన్స్ జోడించి చాలా సీరియస్ సినిమాలు తీస్తారని పేరున్న దర్శకుడు వెట్రిమారన్ త్వరలో అరసన్ తో రాబోతున్నారు. తెలుగులో సామ్రాజ్యం పేరుతో డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా టీజర్ లాంచ్ జరిగింది. పేరుకి ప్రోమో అన్నారు కానీ ఏకంగా 5 నిమిషాలకు పైగా వీడియోతో కంటెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు. వెట్రిమారన్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా చెప్పుకునే వడ చెన్నై యునివర్స్ లో భాగంగా దీన్ని తీస్తున్న క్రమంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ధనుష్ క్యామియో ఉంటుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో బలంగా ఉంది.
కథేంటో వీడియోలో చెప్పలేదు కానీ కాన్సెప్ట్ వివరించారు. ఒక పల్లెటూరి యువకుడు. పైకి అమాయకంగా ఉన్నా లోలోపల అగ్ని పర్వతం మోస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఊళ్ళో ఓ ముగ్గురిని దారుణంగా కత్తులతో నరికి చంపేసి, సైకిల్ మీదెళ్ళి కొళాయి దగ్గర శుభ్రంగా స్నానం చేసే టైపు. ఎన్ని హత్యలు చేసినా ఇతగాడు పోలీసులకు చిక్కడు. ఓసారి దొరికిపోతాడు. కోర్టులో జడ్జ్ అడిగితే నాకేం తెలియదంటూ బుకాయిస్తాడు. మాసిన చొక్కా, పంచెకట్టుతో ఉండే ఇతని వెనుక అంత దారుణమైన నేపథ్యం ఎందుకుంది, నరమేథం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెరమీద చూడాలి.
ఈసారి వెట్రిమారన్ కు అనిరుద్ రవిచందర్ తోడవ్వడంతో సన్నివేశాలలో డెప్త్ పెరిగిపోయింది. విడుదల పార్ట్ 1 2, అసురన్, విసరనై తరహా ట్రీట్ మెంట్ సామ్రాజ్యంలో కనిపిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా శింబుని ఎవరూ చూపించినంత డార్క్ క్యారెక్టర్ లో వెట్రిమారన్ ప్రెజెంట్ చేయబోతున్న వైనం స్పష్టమవుతోంది. మూవ్ లవర్స్ వెట్రి నుంచి కోరుకుంటున్నది ఇలాంటి బ్లాస్ట్ లే. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ వచ్చే ఏడాది వేసవిలో రావొచ్చని ఒక అంచనా. క్యాస్టింగ్ గురించి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న వెట్రిమారన్ బృందం ఈసారి తెరమీద రక్తపాతం చిందించడం ఖాయం.
This post was last modified on October 17, 2025 10:54 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…