సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి పలువురు హీరోలు సిద్ధమయ్యారు. సాయి ధరమ్ తేజ్ అయితే అందరికంటే ముందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పటికీ కొన్ని పెద్ద సినిమాలకు ఓటిటి రిలీజ్ మీద ఆసక్తి వుందంటే ఆశ్చర్యం కలుగుతోంది. వాటిలో నితిన్ రంగ్ దే ఒకటట. గత చిత్రం భీష్మతో హిట్టు కొట్టిన నితిన్ ఈ చిత్రాన్ని ఎలా విడుదల చేసుకున్నా ఓకే అని చెప్పేసాడట. ఓటిటి ద్వారా రావడానికి లేదు, థియేటర్లలోనే విడుదల చేయాలని అతను కండిషన్స్ ఏమీ పెట్టడం లేదు.
అయితే థియేటర్లు తెరిచినా కానీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అప్పటి మాదిరిగా కలక్షన్లు వస్తాయా అనేది అనుమానంగా వుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా బాగా అవడంతో ఒక నాలుగైదు కోట్లు లాభం వచ్చేలా ఓటిటి డీల్ ఏదైనా వస్తే ‘సోలో బ్రతుకే సో బెటర్’లా ఓకే చేసేసుకోవాలని చూస్తున్నారట. సోలో.. సినిమాను జీ నెట్‍వర్క్ టోటల్ నెగెటివ్ రైట్స్ తీసుకుని థియేటర్లలో విడుదల చేస్తోంది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ గోల వుండదు కాబట్టి నిర్మాతకు ఎలాంటి చీకు చింత వుండదు. అలాగే రంగ్ దేకు కూడా డీల్ సెట్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బహుశా త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడవచ్చు.
This post was last modified on November 29, 2020 1:45 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…