విజయ్ దేవరకొండ కింగ్డమ్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇవాళ మరో సినిమా హాట్ టాపిక్ అయ్యేది. అదే మ్యాజిక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్సే నిర్మించిన ఈ చిన్న మూవీ సంవత్సరం పైనే గడుస్తున్నా ఊసులో లేకుండా పోయింది. అనిరుధ్ రవిచందర్ లాంటి క్రేజీ సంగీత దర్శకుడు పని చేస్తున్నా దాన్నసలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ కింగ్డమ్ ఫెయిలవ్వడంతో టీమ్ ఒక్కసారిగా షాక్ తింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన మ్యాజిక్ షూటింగ్ అసలు పూర్తయ్యిందో లేదో క్లారిటీ లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే చిత్రీకరణ అయిపోయిందనే ఉంది.
ఇక్కడ మేజిక్ మోక్షానికి కొన్ని సమస్యలున్నాయి. గౌతమ్ తిన్ననూరి బ్రాండ్ దీనికి ఇప్పుడు పెద్దగా పని చేయదు. ఒకవేళ జెర్సీ తర్వాత వచ్చి ఉంటే లెక్క వేరే కానీ కింగ్డమ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కావడంతో బజ్ విషయంలో ఇబ్బందులున్నాయి. ఇంకోవైపు నిర్మాత నాగవంశీ మంచి స్ట్రగుల్ లో ఉన్నారు. కింగ్డమ్ పోవడం సంగతి పక్కనపెడితే వార్ 2 డిస్ట్రిబ్యూషన్ బాగా దెబ్బ కొట్టింది. హృతిక్ తారక్ కాంబోని గుడ్డిగా నమ్మడం చేదు ఫలితాన్ని ఇచ్చింది. రవితేజ మాస్ జాతర ఈ నెలాఖరులో రిలీజ్ ఉండగా దానికీ హైప్ సమస్య ఉంది. రెండు వారాల్లో దాన్ని ఎలా పెంచాలనే దాని మీద పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దానికి సంబంధించిన పనులు చూసుకోవాలి. ఇవి కాకుండా సెట్స్ మీద విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలు చివరి స్టేజిలో ఉన్నాయి. ఇంత ఒత్తిడి మధ్య అసలు మేజిక్ గురించి ఆలోచించే టైం నాగవంశీ దగ్గర లేదనేది దగ్గరి వర్గాల మాట. పైగా మేజిక్ నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి ఆడియో సింగల్ పెద్దగా మేజిక్ చేయలేదు. అసలు అనిరుధే బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. ఉన్నవాటికి సమయం కేటాయించడమే కష్టమైపోతుంది. అందుకే మేజిక్ చివరి ప్రాధాన్యంలో ఉందేమో.
This post was last modified on October 16, 2025 4:52 pm
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…