బెల్లంకొండ శ్రీనివాస్‍కి ఒక స్టడీ మార్కెట్ వచ్చే వరకు అతనితో నటించే హీరోయిన్ల విషయంలో అసలు రాజీ పడలేదు. అప్పటికి హాట్ అనిపించుకున్న హీరోయిన్లకు మార్కెట్ రేటుకి మించి పారితోషికం ఇచ్చి మరీ అతని సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు శీనుతో పరిచయం అయిన శ్రీనివాస్ మొదటి సినిమాలోనే సమంతతో రొమాన్స్ చేసాడు. అందుకోసం అప్పట్లో సమంతకు భారీ పారితోషికం ఇచ్చారని కథలు కథలుగా చెప్పుకున్నారు.
పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి హీరోయిన్లతో నటించిన శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూలో కూడా స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో హీరోయిన్‍గా కియారా అద్వానీ వుంటే బాగుంటుందని భావిస్తున్నాడు. ఇప్పుడు కియారాకు బాలీవుడ్‍లో చాలా డిమాండ్ వుంది.
బాలీవుడ్ ఏ లిస్ట్ హీరోలతో నటిస్తోన్న కియారా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే రేంజ్‍కి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెను ఒప్పించాలంటే కచ్చితంగా భారీగా పారితోషికం ఇచ్చి తీరాలి. ఒకవేళ అన్ని డబ్బులిచ్చినా కానీ కియారా ఈ టైమ్‍లో ఒక సౌత్ హీరో డెబ్యూ సినిమాలో నటిస్తుందా లేదా అనేది అనుమానమే.
This post was last modified on November 29, 2020 1:34 am
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం…
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డులు సృష్టించిన పుష్ప 2…
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ…
టాలీవుడ్లో కొత్త వాళ్లను బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళలో నాని ఒకడు. అతను ఎక్కువగా కొత్త, అప్కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పాలనలో పెద్దగా అనుభవం లేదని చెప్పాలి. ఓ డిప్యూటీ…