అక్టోబర్ 31 ఎంతో దూరంలో లేదు. మాస్ జాతర విడుదలయ్యేది ఆ రోజే. అయితే దీని కన్నా ఎక్కువగా బాహుబలి రీ రిలీజ్ సౌండ్ చేయడం రవితేజ అభిమానులకు రుచించడం లేదు. ఎందుకంటే వరస ఫ్లాపుల తర్వాత తమ హీరోకి ఊరట దక్కబోతోందన్న నమ్మకం వాళ్లలో ధృడంగా ఉంది. అయితే ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా హీరోతో పాటు టీమ్ చేసిన ఒక కామన్ ఇంటర్వ్యూ తప్ప ఇంకే కంటెంట్ బయటికి రాలేదు. అసలైన ట్రైలర్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు ట్రేడ్ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఓజి తర్వాత మళ్ళీ పెద్ద హీరో సినిమా సందడి చేయబోయేది మాస్ జాతరతోనే. అందుకే ఇంత ఫోకస్.
నిర్మాత నాగవంశీ ఇంకా రంగంలోకి దిగలేదు. ఆయన వస్తే ఊపొస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఇతరత్రా ప్రోగ్రాంస్ ప్లాన్ చేయాలి. రవితేజ చూస్తేనేమో భర్త మహాశయులకు విజ్ఞప్తి కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. వచ్చే వారానికి రిటర్న్ అవుతారట. శ్రీలీల మీడియాకు అందుబాటులోకి రావాలి. భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు భాను భోగవరపు పోస్ట్ ప్రొడక్షన్ ని చివరి దశకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంత హడావిడి మధ్య పబ్లిసిటీకి అట్టే టైం దొరకడం లేదు. మాస్ జాతర టైటిల్ తో ఫ్యాన్స్ కు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే బ్లాక్ బస్టర్ అవ్వాలని వాళ్ళ కోరిక.
సో ఇప్పుడు కావాల్సింది వైరల్ కంటెంట్. అంటే పాటనో లేదా ఏదైనా కిక్క్ ఇచ్చే వీడియో మెటీరియలో వదలాలి. రవితేజ ఎంత యాక్టివ్ గా వీటిలో పాల్గొంటారనేది కీలకం. అసలు సమస్య ఇది కాదు బాహుబలి ది ఎపిక్ ఫీవర్ మెల్లగా పెరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు మూవీ లవర్స్ లోనూ దీన్ని ఖచ్చితంగా ఎక్స్ పీరియన్స్ చేయాలనే కోరిక పెరుగుతోంది. సోషల్ మీడియా ట్రెండ్స్ లో దాన్ని గమనించవచ్చు. దానికి తగ్గట్టే ఆర్కా మీడియా సంస్థ ఎక్స్, ఇన్స్ టాలో చేస్తున్న వెరైటీ ప్రమోషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. థియేటర్లు పెద్ద ఎత్తున బ్లాక్ చేస్తున్నారు. దీని కాచుకోవడం పెద్ద సవాల్ గా మారేలా ఉంది.
This post was last modified on October 15, 2025 9:51 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…