చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్‌గా దేశవ్యాప్తంగా అవికా గోర్ ఎంత పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ గుర్తింపుతోనే ఆమె హీరోయిన్ కూడా అయింది. తెలుగులో దాదాపు 20 సినిమాల దాకా నటించింది. హిందీలో కూడా ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. మధ్యలో తెలుగు సినిమాలకు కొంత కాలం దూరమైన ఆమె.. బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారై వచ్చింది. ఆ తర్వాత ఆమె మళ్లీ అవకాశాలు పెరిగాయి.
పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా.. చిన్న చిత్రాలకు మాత్రం లోటు లేదు. ఇలా కెరీర్ బాగానే సాగుతున్న టైంలో అవికా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నేళ్లుగా రిలేేషన్‌షిప్‌లో ఉన్న మిలింద్‌నే ఆమె పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం మామూలుగా జరగలేదు. ఒక రియాలిటీ షోకు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుంది అవికా. దీని మీద విమర్శలు తప్పలేదు.
అవికా పెళ్లిని కూడా కమర్షియల్ చేసేసిందని.. డబ్బు కోసమే ఈ మార్గాన్ని ఎంచుకుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పలేదు. దీనిపై అవికా తాజాగా స్పందించింది. తాను డబ్బు కోసం ఇలా చేయలేదని.. తనకు లైఫ్ ఇచ్చింది టీవీనే అని.. అందుకే టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవాలన్నది తన చిన్ననాటి కోరిక అని ఆమె చెప్పింది.
‘‘టీవీ షోలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మిలింద్‌కు చెప్పినపుడు అతను ఓకే అన్నాడు. కానీ జనం నుంచి విమర్శలు వస్తాయి కదా అన్నాడు. డబ్బు కోసమే అలా చేస్తున్నామని అంటారేమో అని సందేహించాడు కూడా. కానీ నేను పర్వాలేదన్నాను. ఈ నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. అనుకున్నట్లే ట్రోల్స్ వచ్చాయి. కొందరు నా వెడ్డింగ్ లుక్ మీదా విమర్శలు గుప్పించారు. కానీ ఆ ట్రోల్స్ మిలింద్ మీద వస్తే ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే తన లుక్ డిజైన్ చేసింది నేనే. మిగతా విషయాల్లో ఏమీ బాధ లేదు’’ అని అవికా చెప్పింది. ఓ హిందీ రియాలిటీ షోలో సెప్టెంబరు 30న వీరి పెళ్లి ఆడంబరంగా సాగింది.
This post was last modified on October 15, 2025 5:12 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…