Movie News

హిరణ్య కశ్యప.. లిస్టులోంచి తీసేయకండి

రానా దగ్గుబాటి హీరోగా ‘హిరణ్య కశ్యప’ తీయడం గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. చివరగా ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రాన్ని తీసిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఈ మెగా ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నాడు. దీని మీద ఎడతెగని పరిశోధన చేస్తున్నాడు. ఆయన పరిశోధన, స్క్రిప్టు నచ్చి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు రానా తండ్రి సురేష్ బాబు.

ఐతే సురేష్ పెద్ద బడ్జెట్లలో సినిమాలు తీయడం ఎప్పుడో మానేశారు. గత దశాబ్ద కాలంలో ఆయన తీసిన అతి పెద్ద సినిమా అంటే ‘వెంకీ మామ’నే. మిగతావన్నీ చిన్న, మీడియం రేంజి సినిమాలే. బడ్జెట్ విషయంలో బాగా పొదుపు పాటించే ఆయన దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యే ‘హిరణ్య కశ్యప’ను రానా, గుణశేఖర్‌లను నమ్మి ఎలా తీస్తాడన్న సందేహం అందరిలోనూ ఉంది.

దీనికి తోడు కరోనా దెబ్బకు ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’కు బ్రేక్ పడిందన్న ప్రచారం మొదలైంది. ముందు బడ్జెట్లో కోత అన్నారు. తర్వాత సినిమానే ఆపేస్తున్నారని మాట్లాడుకున్నారు. కానీ సురేష్ బాబు మాత్రం ఆ సినిమా కచ్చితంగా ఉందనే అంటున్నారు. కరోనా నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొడక్షన్లో రాబోయే కొత్త సినిమాల గురించి ఆయన మాట్లాడారు.

‘హిరణ్య కశ్యప’ తప్పక ఉంటుందని.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని చెప్పారు సురేష్ బాబు. మిగతా సినిమాల గురించి చెబుతూ.. ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిందని.. మే 1న రిలీజ్ అనుకున్నామని.. లాక్ డౌన్ వల్ల కుదరట్లేదని చెప్పారు.

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘నారప్ప’ 25 శాతం చిత్రీకరణ మిగిలుందని.. ‘విరాట పర్వం’కు ఇంకో 8 రోజులు పని చేస్తే సరిపోతుందని చెప్పారు. రవిబాబుతో నిర్మిస్తున్న ‘క్రష్’కు కూడా ఇంకో ఐదారు రోజుల పని మాత్రమే మిగిలున్నట్లు ఆయన తెలిపారు. మిగతా సినిమాల సంగతలా ఉంచితే.. ‘హిరణ్య కశ్యప’ ఉంటుందన్నది ఆసక్తికర అప్ డేటే.

This post was last modified on May 2, 2020 1:42 pm

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

3 hours ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

3 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

5 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

7 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

9 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

11 hours ago