భాషా భేదం లేకుండా ఎక్కడి సినిమాలనైనా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులకు పేరుంది. ఐతే చరిత్ర చూస్తే వాళ్లు అత్యధికంగా ఆదరించిన పరభాషా చిత్రాలు.. తమిళంవే. ఆ పరిశ్రమకు చెందిన రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య సహా పలు హీరోలను ఇక్కడి స్టార్లతో సమానంగా ఆదరించారు. వాళ్ల సినిమాలు ఇక్కడి చిత్రాలను డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. ఐతే గత కొన్నేళ్లలో తమిళ సినిమాల పట్ల మన వాళ్లకు ఆసక్తి తగ్గిపోతోంది.
గత దశాబ్దంలో తమిళ చిత్రాల క్వాలిటీ పడిపోవడం వాస్తవం. ఈ మధ్య మరీ సబ్ స్టాండర్డ్ సినిమాలు వస్తున్నాయి అక్కడి నుంచి. కానీ అదే సమయంలో కన్నడ చిత్రాలకు తెలుగు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు కన్నడలో ఎక్కువగా తెలుగు, తమిళ రీమేక్‌లు తెరకెక్కేవి. అక్కడ రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీసేవారు. మన సినిమాల ముందు అవి ఎంతమాత్రం నిలిచేవి కావు. కానీ గత కొన్నేళ్లలో కన్నడ చిత్రాల క్వాలిటీ ఎంతగానో పెరిగింది.
కేజీఎఫ్ కన్నడ సినిమాల్లో గేమ్ చేంజర్‌గా నిలిచింది. కన్నడ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో ఆదరించడం ఆ చిత్రంతోనే మొదలైంది. ఆ తర్వాత కేజీఎఫ్-2, కాంతార, సప్త సాగరాలు దాటి, విక్రాంత్ రోణ.. ఇలా చాలా సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్-2’ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది.
ఫుల్ రన్లో వసూళ్లు రూ.120-130 కోట్ల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగులో అనువాద చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు కన్నడ సినిమా అయిన ‘కేజీఎఫ్-2’ పేరిటే ఉండడం విశేషం. ఇప్పుడు ‘కాంతార-2’ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ‘2.0’ కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది. కన్నడ సినిమాలకు తెలుగులో ఇలాంటి వసూళ్లు వస్తాయని ఓ పదేళ్ల ముందు ఎవరైనా అంటే నవ్వుకునేవాళ్లమేమో. నార్త్ ఇండియాలో కూడా కన్నడ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడం విశేషం. నెమ్మదిగా తమిళ అనువాదాల స్థానాన్ని కన్నడ చిత్రాలు అధిగమిస్తున్న మాట వాస్తవం.
This post was last modified on October 15, 2025 9:52 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…