ఎంత మోడర్న్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ అయినా సరే… ఇంటమేట్ సీన్లు, లిప్ లాక్స్ చేస్తానంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడడం కామన్. సినిమాల్లోకి వెళ్లేటపుడు అలాంటి సీన్లు వద్దు అని కండిషన్స్ పెట్టి పంపిస్తుంటారు. ఇలాంటి అనుభవాల గురించి చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ తల్లిదండ్రులు మాత్రం దీనికి భిన్నంగా స్పందించారట. లిప్ లాక్స్ విషయంలో ఆ హీరోయిన్ భయపడి చాన్నాళ్ల పాటు ‘నో కిస్’ పాలసీని మెయింటైన్ చేస్తే.. తల్లిదండ్రులు మాత్రం దాందేముంది అంటూ తేలిగ్గా కొట్టిపారేశారట.
చాలా ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రుల స్పందన గురించి తెలుసుకుని షాకయ్యాను అంటోంది పంజాబీ ముద్దుగుమ్మ సోనమ్ బజ్వా. తెలుగులో సుశాంత్ సరసన కథానాయికగా ‘ఆటాడుకుందాం రా’తో పాటు వెంకీ మూవీ ‘బాబు బంగారం’లో ఒక పాత్ర చేసింది సోనమ్. సోనమ్ తమిళంతో పాటు హిందీలోనూ అనేక సినిమాలు చేసింది. చివరగా ఆమె ‘హౌస్ ఫుల్-5’లో కనిపించింది. హర్షవర్ధన్ రాణే సరసన నటించిన ‘ఏక్ దీవానీ కీ దీవానియత్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘కిస్’ సీన్ల విషయంలో తల్లిదండ్రులు తనకిచ్చిన షాక్ గురించి ఆమె మాట్లాడింది.
‘‘ఇండస్ట్రీలోకి వచ్చినపుడు ముద్దు సీన్లు చేయొద్దని అనుకున్నా. ఆ సీన్లు ఉండడం వల్లే అనేక హిందీ చిత్రాలను వదులుకున్నా. నేను ఆ సన్నివేశాల్లో నటిస్తే మా పంజాబీ ప్రజలు అంగీకరిస్తారా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమనుకుంటారు.. అన్నింటికీ మించి మా కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా అని రకరకాల ఆలోచనలు నన్ను వెంటాడేవి. ఐతే కొన్నేళ్ల తర్వాత వెళ్లి ఈ విషయం గురించి మా అమ్మానాన్నతో మాట్లాడితే.. ‘సినిమా కోసమే కదా అవి చేసేది. అందులో సమస్యేంటి’ అంటూ తేలిగ్గా మాట్లాడ్డంతో నేను షాకయ్యా. ఇన్ని రోజులు వాళ్లతో దాని గురించి ఎందుకు మాట్లాడలేదా అనుకున్నా’’ అని సోనమ్ బజ్వా తెలిపింది.
This post was last modified on October 14, 2025 4:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…