విజయ్ దేవరకొండ తమ్ముడు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలో సరైన బ్రేక్ అందక ఇబ్బంది పడ్డాడు ఆనంద్ దేవరకొండ. ఐతే అతడికి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఆపై ‘బేబీ’ మూవీతో అతడికి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. కానీ తర్వాత మళ్లీ కెరీర్లో గ్యాప తప్పలేదు.
బేబీ మేకర్స్‌తో అనుకున్న సినిమాకు బ్రేక్ పడి వేరే హీరో చేతుల్లోకి వెళ్లిపోగా.. కొంచెం గ్యాప్ తర్వాత ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది చాలా వరకు లండన్లో షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ఆ చిత్రం పూర్తి కానుంది. ఈలోపు ఆనంద్ హీరోగా ఒక ఓటీటీ సినిమా తెరపైకి వచ్చింది. ఆ చిత్రానికి ‘తక్షకుడు’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ రోజే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆ చిత్రాన్ని అనౌన్స్ చేసింది.
అగ్గిలా మండుతున్న గన్నును పట్టుకున్న నక్సలైట్ లుక్‌తో ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా కనిపించింది ‘తక్షకుడు’లో. దీనికి ‘వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు’ అనే క్యాప్షన్ జోడించారు. బహుశా ఇందులో అన్యాయానికి బలయ్యే అమాయకుడి పాత్రలో ఆనంద్ కనిపించనున్నాడేమో. అందుకే ఈ క్యాప్షన్ పెట్టారేమో. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
సితార సంస్థ నుంచి వచ్చే సినిమా ఈ రోజుల్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఎందుకు ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావట్లేదో మరి. ఆనంద్‌కు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో బ్రేక్ ఇచ్చిన వినోద్ అనంతోజునే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. ఇందులో బాలీవుడ్ క్లాసిక్ ‘లాపతా లేడీస్’తో మంచి పేరు సంపాదించిన నితాంశి గోయెల్ కథానాయికగా నటించింది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
This post was last modified on October 14, 2025 12:56 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…