గేరు మార్చిన తెలుసు కదా – ఎందుకో తెలుసా

మహిళ కాబట్టి నీరజ కోన మొదటిసారి దర్శకత్వం వహించిన తెలుసు కదాని అందరూ సాఫ్ట్ లవ్ స్టోరీ అనుకున్నారు. ఇద్దరమ్మాయిలు ఒకబ్బాయి కథలు గతంలో చాలా చూశాం కాబట్టి ఇది కూడా ఆ కోవలోనే ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సిద్దు జొన్నలగడ్డ మార్క్ క్రేజీ డైలాగులు టీజర్ లో లేకపోవడంతో ఈ నమ్మకం మరింత బలపడింది. కానీ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు మార్చేసింది. కూల్ రొమాంటిక్ స్టోరీ అనుకుంటే కాదు కాదు చాలా హాట్ గురు అనిపించేలా ఏకంగా అర్జున్ రెడ్డి తరహా క్యారెక్టరైజేషన్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన మాట వాస్తవం. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

నీరజ కోన మీద బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కరణ్ జోహార్, జోయా అక్తర్ లాంటి న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ ప్రభావం ఉంది. ఆ మాట ఆవిడే ఒప్పుకున్నారు. వాళ్ళు రాసుకునే సబ్జెక్టులు సాంప్రదాయ సమాజం అంత సులభంగా ఒప్పుకునేలా ఉండవు. అన్ కన్వెషనల్ స్టోరీ టెల్లింగ్ ద్వారా జెన్ జెడ్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటారు. కానీ తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు అరుదు. ఒకరిద్దరు చేసినా వర్కౌట్ కాక మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. కానీ నీరజ కోన అలా కాకుండా రిస్క్ అనిపించినా సరే ఇలాంటివి సిద్ధూ జొన్నలగడ్డ లాంటి ఫాలోయింగ్ ఉన్న హీరో ద్వారా చెప్పించాలని డిసైడయ్యి మెప్పించారు.

ఇప్పుడీ తెలుసు కదా మీద సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. షారుఖ్ ఖాన్ డర్ తరహాలో షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఒకరు, లేదు కభీ అల్విదా న కెహెనా టైపులో షాకింగ్ ట్రీట్ మెంట్ చూడొచ్చని మరొకరు ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఇన్ సైడ్ టాక్ మాత్రం తెలుసు కదా కాన్సెప్ట్ కనక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక కొత్త ట్రెండ్ కి దారి తీస్తుందని అంటున్నారు. అందుకే పోటి గురించి పట్టించుకోకుండా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఒక్కసారిగా బజ్ పెంచేశారు . చూడాలి మరి అక్టోబర్ 17 ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.