హీరో నితిన్ కెరీర్ లోనే అది పెద్ద డోలాయమానంలో ఉన్నాడు. వరసగా నాలుగు డిజాస్టర్లు డిఫెన్స్ లో పడేశాయి. ఏదో ఒకటి యావరేజ్ అయినా సర్దుకుపోవచ్చేమో కానీ ఒకదాన్ని మించి మరొకటి మరీ అన్యాయంగా పోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుందని భావించిన ఎల్లమ్మని నిర్మాత దిల్ రాజు పెండింగ్ లో పెట్టడమే కాక వేరే హీరోతో తీయాలనే ఆలోచన చేస్తున్నారనే వార్త రావడం అనూహ్య పరిమాణం. దర్శకుడు వేణు యెల్దండి ప్రస్తుతం అదే పని మీద ఉన్నాడు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ నుంచి నితిన్ కు ఎదురవుతున్న ప్రశ్న ఒకటే వాట్ నెక్స్ట్.
నిజానికి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న స్వారీ ఈపాటికి ప్రారంభమైపోయి ఉండాలి. కానీ జరగలేదు. ఇష్క్ కాంబోని రిపీట్ చేస్తూ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉండగా ఇది కూడా పెండింగ్ లో పడిపోవడం ఊహించని ట్విస్ట్. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కావడంతో రకరకాల కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోందట. ఇప్పుడు కొత్తగా లిటిల్ హార్ట్స్ తో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సాయి మార్తాండ్ పేరు వినిపిస్తోంది. నితిన్ కు ఒక లైన్ వినిపించాడని, ఫుల్ వెర్షన్ కనక ఇద్దరికీ సంతృప్తికరంగా అనిపిస్తే పట్టాలు ఎక్కే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్.
ఇవే కాదు కాదు నితిన్ మరో ఇంట్రెస్టింగ్ మూవీని కూడా గతంలో వదులుకున్నాడు. 90స్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ గత ఏడాదే నితిన్ తో కొంత కాలం ట్రావెల్ చేశాడు. కానీ సెట్స్ పైకి వెళ్లకుండానే హీరో మారిపోయాడు. దాన్నే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో సితార సంస్థ తెరకెక్కిస్తోంది. కథల సెలక్షన్లో తప్పులా లేక దర్శకుల ఎంపికలో తప్పులా ఏదైతేనేం చివరికి మూల్యం చెల్లిస్తోంది మాత్రం నితినే. వీలైనంత త్వరగా ఈ ఫేజ్ నుంచి బయటికి రావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఒక మాంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ అయితే మంచి రోజులు వచ్చేసినట్టే.
This post was last modified on October 12, 2025 11:00 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…