ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ లో చిన్న టీజర్, పాత్రల పోస్టర్లు తప్ప అసలు పెద్దిలో ఏముందో స్పష్టంగా చెప్పే విషయాలు బయటికి రాలేదు. అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్న దర్శకుడు బుచ్చిబాబు, వచ్చే ఏడాది మార్చి 27 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ బోలెడు అవకాశాలు తెచ్చినా కేవలం పెద్ది కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టిన బుచ్చిబాబు సినిమాని తీస్తున్న విధానం, రామ్ చరణ్ డెడికేషన్ గురించి వినిపిస్తున్న లీకులు, బయకొస్తున్న వీడియోలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.
ఒక సాంగ్ షూట్ సందర్భంగా వందల అడుగుల పైనున్న ఎత్తయిన కొండప్రాంతం మీద చరణ్ ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ పాడే పాట బిట్ ఒకటుందట. ఏ మాత్రం పట్టుజారినా ఎక్కడో జారిపడిపోవడం ఖాయమనేంత రిస్క్ లో ఉంది. కానీ అదేమీ పట్టించుకోకుండా టీమ్ దాన్ని షూట్ చేసిన విధానం లైవ్ లో చూసివాళ్లకే గూస్ బంప్స్ ఇచ్చిందంటే ఇక తెరమీద చూసిన ఫ్యాన్స్ ఏమవుతారో. ఇదొక్కటే కాదు టైటిల్ సాంగ్ తీస్తున్న టైంలోనూ రెండు మూడు స్టెప్స్ పూర్తి సంతృప్తినివ్వకపోతే బుచ్చిబాబు రీటేకులు అడగటం, రామ్ చరణ్ సంతోషంగా చేసేద్దాం అని చెప్పడం యూనిట్ కి ఫుల్ జోష్ ఇస్తోందట.
ఇవే కాదు క్రికెట్ ఎపిసోడ్, ఢిల్లీ మైదానంలో వచ్చే క్లైమాక్స్ ఘట్టం, పల్లెటూరిలో చరణ్ చేసే జట్టు కూలి పనులు ఒకదాన్ని మించి మరొకటి మాస్ ఆడియన్స్ కి ఊపేయడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా అంతగా ఫామ్ లో లేని ఏఆర్ రెహమాన్ తో బెస్ట్ సాంగ్స్ రాబట్టుకోవడంలో బుచ్చిబాబు వంద శాతం సక్సెస్ అయ్యాడనే మాట టీమ్ లో వినిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రమోషన్లు మొదలయ్యాక ఎలా ఉండబోతోందో. గేమ్ ఛేంజర్ గాయాన్ని పూర్తిగా మాఫీ చేస్తుందనే నమ్మకంతో ఉన్న మెగా ఫ్యాన్స్ ఆశలకు తగ్గట్టే పెద్ది షేప్ అవుతోంది. వాళ్ళ కోరిక నిజమైతే మాత్రం రంగస్థలంని మించి రికార్డులు బద్దలవ్వడం పక్కా.
This post was last modified on October 11, 2025 5:47 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…