నిన్నటి దాకా ఏదైనా సినిమాకు అనిరుధ్ రవిచందర్ అని సంగీత దర్శకుడిగా పేరు ఉంటే చాలు ప్రాజెక్టుకు తెగ క్రేజ్ వచ్చేసేది. ఇప్పుడేదో తగ్గిందని కాదు కానీ వరస ఫ్లాపుల వల్ల మునుపటి స్థాయిలో నిర్మాతలు వెంటపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఫ్లాప్ సినిమాలకు సైతం తనదైన మార్కు పాటలు, బీజీఎమ్ ఇచ్చి ప్రత్యేకత చాటుకునే అనిరుధ్ కూలిలో మౌనిక మౌనిక తప్ప తన మేజిక్ ని పెద్దగా చూపించలేకపోయాడు. కంటెంట్ బాలేకపోవడం పక్కనపెడితే మదరాసికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మీద విమర్శలు వచ్చాయి. అంతకుముందు కింగ్డమ్ కూడా ఇంచుమించు ఇదే తరహా రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు దర్శకులు నిర్మాతలు కొత్త ఆప్షన్ల వైపు చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ ఆల్రెడీ యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు షిఫ్ట్ అయిపోయారు. అనిరుధ్ కోసం అర్రులు చాచాల్సిన అవసరం లేదనే తరహాలో ఇతర డైరెక్టర్లు కూడా ఆల్టర్నేటివ్స్ వైపు చూస్తున్నారు. అటు తమిళనాడులో సాయి అభ్యంక్కర్ క్రేజీగా మారుతున్నాడు. డ్యూడ్ ఇతని స్థాయిని పెంచేలానే ఉంది. అందుకే ఇకపై అనిరుధ్ పేరుని వాడుకోవడం ఇంతకు ముందులా ఇన్స్ టాంట్ హైప్ తెచ్చేలా లేదు. తాజాగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాకు అనిరుధ్ వర్క్ చేయొచ్చని చెప్పుకోవడం అంతగా వెళ్ళలేదు.
ఇదంతా పక్కనపెడితే అనిరుధ్ రవిచందర్ చేత్లో అరడజను సినిమాలున్నాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ జన నాయకుడు, ప్రదీప్ రంగనాధన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాని ప్యారడైజ్, గౌతమ్ తిన్ననూరి మేజిక్, యష్ టాక్సిక్, షారుఖ్ కింగ్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటిలో కనీసం ఒకటి రెండు చార్ట్ బస్టర్స్ కాగలిగితే అనిరుధ్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అని చెప్పుకోవచ్చు. లేదంటే హర్షవర్ధన్, సాయి అభ్యంక్కర్ లాంటివాళ్లు దూసుకెళ్ళిపోతారు. తమన్ ఓజితో కంబ్యాక్ అయ్యాడు. అఖండ 2, రాజా సాబ్ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది అనిరుధే. చూడాలి మరి ఏం చేయబోతున్నాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates