కొన్ని నెలల క్రితం మాస్ జాతర నుంచి ఓలే ఓలే లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు అందులో బూతుల గురించి పెద్ద డిబేటే జరిగింది. దానికి స్పందించే అవకాశం టీమ్ కి దొరకలేదు కానీ, రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ప్రమోషన్లు మొదలు పెట్టడంతో హీరో రవితేజ, దర్శకుడు భాను భోగవరపు దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని బోల్డ్ మూవీస్ కి స్టాంప్ వేసేసి అందులో ఎంత డబుల్ మీనింగ్ ఉన్నా ఎవరూ అడగరని, కానీ తన సినిమా దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రమే బ్యాడ్ ఎలా కనిపించిందని దర్శకుడు భాను ప్రశ్నించారు. ఉత్సవాల్లో ప్రేమగా తిట్టుకునే పదాలనే పాటలో పెట్టినట్టు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
ఆయన చెప్పిన దాంట్లో కొంత లాజిక్ ఉన్నా దాన్ని పూర్తిగా అంగీకరించలేం. ఉదాహరణకు ఒక ఆగిపోయిన బైకుని వెనుక నుంచి ఒక ఆటో వచ్చి గుద్దిందనుకుందాం. వెంటనే ఇద్దరు డ్రైవర్ల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది. పచ్చి బూతులతో ఒకళ్ళనొకళ్ళు తిట్టి పోసుకుంటారు. ఇది నిజ జీవితంలో చాలాసార్లు చూసి ఉంటాం. ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ సినిమాలో ఇలాంటి సీన్ పెట్టినప్పుడు యధాతథంగా అవే బూతులు పెట్టేసి రియల్ లైఫ్ నుంచి తీసుకున్నామని క్యాప్షన్ వేసి తప్పించుకోలేం. ఎందుకంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు కాబట్టి. అది డైలాగులకైనా పాటలకైనా ఒకటే సూత్రం వర్తిస్తుంది.
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ కు సైతం ఇదే ఇబ్బంది తలెత్తింది. ట్రైలర్ లో బూతులు చూసి వామ్మో ఇవేం మాటలని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. దానికి నరేష్, కిరణ్ ఇద్దరూ తమ వంతుగా భాను తరహాలో కవరింగ్ చేశారు కానీ అసలు సినిమా చూశాకే ఒక క్లారిటీ వస్తుంది. జన జీవనంలో నిత్యం బూతు ఉంటుంది. అందులో డౌట్ లేదు. కానీ అది సందర్భానికి తగ్గట్టు ఒకరిద్దరికి లేదా ఒక గుంపుకి ఉంటుంది. అదే తెరమీదకు వెళ్ళినప్పుడు కోట్లాది ప్రేక్షకులకు చేరుతుంది. అందుకే రచయితలు, దర్శకులు జాగ్రత్తగా ఉంటారు. మరి మాస్ జాతర, కె ర్యాంప్ చేసుకున్న డిఫెన్స్ లో ఎంత నిజముందో అర్థం కావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
This post was last modified on October 8, 2025 3:38 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…