కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ బ్లాక్ బస్టర్ వేళ కొందరు కన్నడ మూవీ ఫ్యాన్స్ రష్మిక మందన్నను టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ సినిమా సక్సెస్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం గురించట. అదేంటి చెప్పాలనే రూల్ లేదు కదాని అనిపించవచ్చు. దీని వెనుకో మతలబు ఉంది. రష్మిక డెబ్యూ చిత్రం కిరిక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టినే. అది గొప్ప విజయం సాధించడం వల్లే ఆమెకు ఇమేజ్, అవకాశాలు వచ్చాయి. వెంకీ కుడుముల ఈ సినిమా చూసి ఉండకపోతే ఛలో ఆఫర్ చేసేవారు కాదేమో. అలా కెరీర్ మలుపు తిరగడానికి బలమైన పునాది వేసింది కిరిక్ పార్టీనే.
అందుకే రష్మిక ఈ సెలబ్రేషన్ ని పంచుకోవాలనేది సదరు శాండల్ వుడ్ అభిమానుల డిమాండ్. అయితే ఈ విషయంలో తను మౌనంగా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో అప్పట్లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న రష్మిక దాన్ని పరస్పర అంగీకారంతోనే రద్దు చేసుకుంది. ఆ సమయంలో తన మీద కొంత ట్రోలింగ్ నడిచింది. ఇదంతా ఎప్పుడో అయిపోయిన గతం. గతంలోనే రక్షిత్ శెట్టి అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారని, రష్మికని ఇలా లక్ష్యంగా చేసుకోవడం పద్ధతి కాదని సోషల్ మీడియాలో హితవు పలికాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ పేరిట కొందరు కథను మళ్ళీ మొదటికే తేవడం విచారకరం. ఇప్పుడు కాంతారకు ముడిపెట్టి రిషబ్ కి విష్ చేయలేదని విమర్శలు చేయడం అర్ధరహితం.
ఒకవేళ రష్మిక నిజంగా కాంతార గురించి స్పందించినా ఈ టార్గెటింగ్ ఆగదు. ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటారు. అందుకే సైలెన్స్ ఈజ్ బెస్ట్. విజయ్ దేవరకొండతో జరిగిన నిశ్చితార్థాన్ని ఇప్పటిదాకా రష్మిక అఫీషియల్ గా చెప్పలేదు. పెళ్లి డేట్, వేదిక, రిసెప్షన్ అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు అధికారికంగా జంటగా దాన్ని అనౌన్స్ చేయబోతున్నారని తెలిసింది. రష్మిక మందన్న కొత్త బాలీవుడ్ మూవీ తమ్మ ఈ నెల 21 విడుదల కానుంది. మొదటిసారి హారర్ జానర్ లో డ్రాకులాగా నటించిన తమ్మలో ఆయుష్మాన్ ఖురానా హీరో. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భులాయ్యా, సైతాన్ తరహాలో దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.
This post was last modified on October 7, 2025 11:53 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…