మాములుగా క్రిస్మస్ పండక్కు ప్రభాస్ లాంటి హీరో సినిమా ఉంటే మిగిలిన వాళ్ళు కాంపిటీషన్ కి దూరంగా ఉంటారు. కానీ ప్యాన్ ఇండియా మూవీ లేదంటే మాత్రం మిగిలినవాళ్లు ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ట్రై చేస్తారు. ఈసారి అదే జరగబోతోంది. డిసెంబర్ 25 మొదటగా లాక్ చేసుకున్నది అడివి శేష్ ‘డెకాయిట్’. దానికి అనుగుణంగానే షూటింగ్ వేగవంతం చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా నుంచి శృతి హాసన్ తప్పుకోవడం వల్ల ఆమె భాగాలను మళ్ళీ రీ షూట్ చేయడంతో వాయిదా తప్పలేదు. ఈసారి డేట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదని టీమ్ అంటోంది. దీనికి దర్శకుడు షానియేల్ డియో.
రెండో పోటీదారు రోషన్ మేక ‘ఛాంపియన్’. శ్రీకాంత్ వారసుడిగా పరిశ్రమకు వచ్చిన రోషన్ పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. స్వప్న సినిమా బ్యానర్ తో పాటు మరో మూడు నిర్మాణ సంస్థలు పాలు పంచుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించాడు. ఏడాదికి పైగానే దీన్ని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఎట్టకేలకు మళ్ళీ ఊపందుకుని గుమ్మడికాయ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. కుర్ర హీరోల్లో తనకంటూ ఇమేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న రోషన్ మేకకు ఛాంపియన్ హిట్ కావడం చాలా అంటే చాలా అవసరం.
ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న ఆల్ఫా మరో పోటీదారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యునివర్స్ లో భాగంగా రూపొందిన ఈ లేడీ గూఢచారి సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది. శార్వరి వాఘ్ మరో కథానాయిక. వార్ 2 క్లైమాక్స్ లో చూపించిన బాబీ డియోల్ సన్నివేశం అల్ఫాలోనిదే. వార్ 2 హిట్టయ్యుంటే హృతిక్, తారక్ లను అలా ఒక షాట్ లో చూపించాలనుకున్నారు కానీ ఇప్పుడది ఛాన్స్ లేదు. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ది అనకొండ సైతం డబ్బింగ్ వెర్షన్లతో మంచి అంచనాలతో అదే రోజు రిలీజ్ కానుంది. ఇక్కడితో అయిపోలేదు. ఇంకెవరైనా హఠాత్తుగా రేసులో జాయిన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on October 6, 2025 5:27 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…