Movie News

ప్రభాస్ పెళ్లి.. గప్‌చుప్

ప్రభాస్ పెళ్లి గురించి చర్చ ఈనాటిది కాదు. పదేళ్ల ముందు నుంచే నడుస్తోందది. ‘డార్లింగ్’ టైంలోనే అతను ఆ చిత్ర కథానాయిక కాజల్‌తో ప్రేమలో పడిపోయాడని, పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘మిర్చి’ సమయానికి అనుష్కతో ముడిపెట్టారు. ఆపై సినీ రంగంతో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని గట్టి ప్రచారమే జరిగింది.

ప్రభాస్ పెదనాన్న పలు సందర్భాల్లో ప్రభాస్ పెళ్లి గురించి మీడియాతో మాట్లాడాడు. ‘బాహుబలి’ తొలి భాగం అయ్యాక పెళ్లన్నాడు. రెండోది కూడా పూర్తి చేశాక కచ్చితంగా పెళ్లి చేసేస్తామన్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాయి. ఐదేళ్లు గడిచాయి. ఆ తర్వాత ‘సాహో’ కోసం రెండేళ్లు ఖర్చు చేశాడు. ఆ తర్వాత కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఏ కదలికా లేదు. అసలిప్పుడు చూస్తే ప్రభాస్‌కు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

రెండేళ్ల కిందటి వరకు ప్రభాస్ పెళ్లి గురించి తరచుగా ఏదో ఒక డిస్కషన్ ఉండేది. కృష్ణంరాజును, అలాగే ప్రభాస్‌ను కూడా మీడియా వాళ్లు ఈ విషయంపై అడిగేవాళ్లు. ప్రభాస్ అభిమానులు దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు పెట్టేవాళ్లు. ఒక దశలో ఈ చర్చ బాగా ముదిరి ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ అనే సినిమా కూడా తెరకెక్కిందంటే ప్రభాస్ పెళ్లికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా గతం. ఈ మధ్య అయితే ప్రభాస్ పెళ్లి గురించి అందరికీ ఆసక్తి చచ్చిపోయినట్లుంది. అది ఎప్పటికీ తెగే వ్యవహారం కాదన్నట్లుగా అందరూ సైలెంట్ అయిపోయారు. కృష్ణంరాజు కానీ, ప్రభాస్ కానీ ఆ విషయంపై ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు. మీడియా వాళ్లు కూడా వాళ్లను ప్రశ్నించట్లేదు. సోషల్ మీడియాలో చర్చల్లేవు. ఇంతకుముందంటే ప్రభాస్ ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రం చేస్తూ పెళ్లేంటన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రతి చిత్రం ‘బాహుబలి’ రేంజ్‌లోనే ఉంటోంది. కాబట్టి ఈ కారణం చూపిస్తే ఇక ఎప్పటికీ ప్రభాస్ పెళ్లే చేసుకోడేమో.

This post was last modified on November 27, 2020 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

32 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago