కొన్ని నెలల ముందే తెలుగు, తమిళ భాషల్లో ‘కుబేర’ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. సినిమాకు రెండు చోట్లా మంచి టాక్ వచ్చింది. రివ్యూలు ఫుల్ పాజిటివ్‌గా వచ్చాయి. తమిళ హీరో ధనుష్ లీడ్ రోల్ చేసినప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా ఈ చిత్రాన్ని ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. ‘లవ్ స్టోరీ’తో షాక్ తిన్న శేఖర్ కమ్ములకు ఈ చిత్రం మళ్లీ మంచి విజయాన్నందించింది. ఆయన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ‘కుబేర’ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్య పాత్రధారులందరికీ సినిమా మంచి పేరే తెచ్చింది.
ఐతే తెలుగులో ఇంత మంచి ఫలితాన్నందుకున్న సినిమాకు తమిళంలో మాత్రం తిరస్కారం ఎదురైంది. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలను బాగా ఆదరిస్తారని పేరు తెచ్చుకున్న తమిళ ప్రేక్షకులు.. కొత్తదనం ఉన్న, మంచి సినిమాను ఆదరించలేదు. ఆ సినిమా తమిళ రిజల్ట్ ధనుష్ సహా అందరికీ పెద్ద షాకే.
కానీ ‘కుబేర’ లాంటి వైవిధ్యమైన, కంటెంట్ ఉన్న సినిమాను తిరస్కరించిన తమిళ ప్రేక్షకులు.. ఇప్పుడు ధనుష్ కొత్త చిత్రం ‘ఇడ్లీ కొట్టు’ను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇదేమంత గొప్ప సినిమా కాదు. రొటీన్ సెంటిమెంట్ మూవీ. ఒక ఇడ్లీ కొట్టు నేపథ్యంలో తండ్రీ కొడుకుల ఎమోషన్ మీద ఈ చిత్రాన్ని నడిపించాడు దర్శకుడు ధనుష్. పెర్ఫామెన్స్ పరంగా చూసినా ధనుష్‌కు ఇదేం కొత్త కాదు. కానీ ‘కుబేర’లో అతను నేషనల్ అవార్డ్ విన్నింగ్ లెవెల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
‘ఇడ్లీ కొట్టు’ రొటీన్ సినిమా అంటూ తెలుగు ప్రేక్షకులు తిప్పి కొట్టేశారు. కానీ ఆ రొటీన్ కంటెంట్‌నే తమిళ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కంటెంట్ పరంగా ‘ఇడ్లీ కొట్టు’ ఎంతమాత్రం ‘కుబేర’కు సరితూగేది కాదు. అయినా తమిళ ప్రేక్షకులకు ఇదే నచ్చుతోంది. మరి రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉండడమే ‘కుబేర’కు శాపమైందా.. లేక తెలుగు డైరెక్టర్, నిర్మాత తీసిన సినిమాను మనం ఆదరించడమేంటి అనే సంకుచిత భావాన్ని చూపించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాను రాను తమిళ ప్రేక్షకుల అభిరుచి ఇంత సాధారణంగా తయారవుతోందనడానికి ‘ఇడ్లీ కొట్టు’ తాజా రుజువు అని చెప్పాలి.
This post was last modified on October 6, 2025 4:14 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…