Movie News

ఇడ్లీ సాంబార్ తట్టుకుని నిలబడింది

బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడుతున్న కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల దూసుకెళ్తోంది. వీకెండ్ కే మూడు వందల కోట్ల గ్రాస్ దాటేయడం జరిగిపోయింది కానీ అఫీషియల్ గా నిర్మాణ సంస్థ నుంచి పోస్టర్ ఏ క్షణమైనా బయటికి రావొచ్చు. అయితే కాంతార ప్రభంజనాన్ని ఏపీ తెలంగాణలో ఇడ్లీ కొట్టు ఫేస్ చేయలేకపోయింది. చాలా సెంటర్లలో దీని షోలు తీసి దానికి ఇవ్వాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులోనూ కాంతార వసూళ్లు బాగుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. .

తెలుగులో ఇడ్లి కొట్టు ఎంత ఫెయిలైనా ఒరిజినల్ వెర్షన్ మాత్రం తట్టుకుని నిలబడింది. కోలీవుడ్ ఫ్యాన్స్ కి ఇడ్లీ సాంబార్ నచ్చేసింది. బుక్ మై షోలో వీకెండ్ వరకు ఏడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా సుమారు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలయ్యిందని సమాచారం. ధనుష్ మార్కెట్ కి ఇది మంచి నెంబరే. కేవలం తమిళం నుంచే ఇంత నెంబర్ సాధించడం చూస్తే తన కంటెంట్ కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. సాధారణంగా ఓవర్ సెంటిమెంట్ ఉన్నా నేటివిటీ, ఎమోషన్స్ కనక సరిగా చూపిస్తే తమిళ ఆడియన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా మాస్, కుటుంబ ప్రేక్షకుల మద్దతు బాగా దక్కుతుంది. ఇడ్లి కడై అందుకే హిట్టు క్యాటగిరీలో పడుతోంది.

ఫలితం పట్ల ధనుష్ సంతోషంగానే ఉన్నాడు. గత ఏడాది తనే డైరెక్ట్ చేసిన రాయన్ రేంజ్ నెంబర్లు రాకపోవచ్చేమో కానీ ఇంత హెవీ ఎమోషనల్ సబ్జెక్టు మీద ముప్పై కోట్లు రాబట్టడం చిన్న విషయం కాదు. అందులోనూ పక్క భాషలో డిజాస్టర్ అయిన సినిమాకు స్వంత చోట ఆదరణ దక్కడం సంతోషించాల్సిన విషయమే. కాంతార హవాని తట్టుకుని మరీ ఇంత స్ట్రాంగ్ గా వసూళ్లు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్స్ ని బట్టి ఫైనల్ స్టేటస్ మీద ఒక అంచనాకు రావొచ్చు. అన్నట్టు ఇడ్లి కడై 2 కావాలని ఫ్యాన్స్ అడిగితే ధనుష్ సానుకూలంగా  ఆలోచిస్తున్నట్టు చెన్నై టాక్.

This post was last modified on October 5, 2025 10:10 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Idli kottu

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago