Movie News

సీత పాత్ర‌ను రిజెక్ట్ చేయ‌డ‌మా… ఛాన్సే లేదు

సౌత్ ఇండియ‌న్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన చిత్రాల్లో కేజీఎఫ్ ఒక‌టి. బాహుబ‌లి త‌ర్వాత అతి పెద్ద సెన్సేష‌న్ ఈ చిత్ర‌మే. ఇందులో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. హీరో య‌శ్ రేంజే మారిపోయింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్లలో ఒక‌డైపోయాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ కూడా తిరుగులేని స్థాయికి చేరుకుంది. 

క‌థానాయిక శ్రీనిధి శెట్టి కూడా బిజీ హీరోయిన్‌గా మారింది. ఆల్రెడీ ఆమె తెలుగులో హిట్-3 చిత్రంలో న‌టించింది. త్వ‌ర‌లోనే తెలుసు క‌దా మూవీతో ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటి కంటే ముందు రామాయ‌ణం లాంటి మెగా మూవీ కోసం ఆమె పేరును క‌న్సిడ‌ర్ చేస్తున్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ సీత పాత్ర‌కు అడిగితే శ్రీనిధి నో చెప్పిన‌ట్లు రూమ‌ర్లు వినిపించాయి. ఇదే విష‌యాన్ని తెలుసు క‌దా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావిస్తే.. ఆ ప్ర‌చారం అబ‌ద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసింది శ్రీనిధి.

”రామాయ‌ణం లాంటి మెగా మూవీలో సీత పాత్ర చేసే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైనా రిజెక్ట్ చేస్తారా అంటూ ఆమె ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఈ సినిమా కోసం తాను ఆడిష‌న్ ఇచ్చిన మాట వాస్త‌వ‌మే అని ఆమె వెల్ల‌డించింది. రామాయ‌ణం సినిమా కోసం న‌న్ను అడిగారు. కాల్ రాగానే వెళ్లి ఆడిష‌న్ ఇచ్చాను. అంత పెద్ద సినిమాలో ఛాన్స్ అంటే ఎవ్వ‌రైనా హ్యాపీగా ఫీల‌వుతారు. అందులోనూ సీత పాత్ర అంటే కాళ్ల‌కు దండం పెట్టి తీసుకుంటారు. నేను ఆ పాత్ర చేయాల‌ని ఆశ‌ప‌డ్డా. 

కానీ వాళ్లు ఈ పాత్ర కోసం చాలా పేర్ల‌ను ప‌రిశీలించి ఉంటారు. వాళ్ల ద‌గ్గ‌ర ఒక లిస్ట్ ఉంటుంది. అందులో ఎవ‌రు బెస్ట్ అనిపిస్తే వాళ్ల‌ను తీసుకుంటారు. అందులో నేను ఫీల‌య్యేది ఏమీ లేదు. ఆ పాత్ర కోసం సాయిప‌ల్ల‌విని తీసుకున్నార‌ని తెలిసిన‌పుడు.. మ‌న సౌత్ నుంచే ఒక అమ్మాయిని తీసుకున్నారు క‌దా అని చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. ఇలాంటి సినిమాను రిజెక్ట్ చేయ‌డం అంటూ ఏమీ ఉండ‌దు. అది త‌ప్పు” అని శ్రీనిధి శెట్టి పేర్కొంది. హిట్-3తో హిట్ కొట్టిన శ్రీనిధి.. తెలుసు క‌దా విష‌యంలోనూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. స్టైలిస్ట్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ నీర‌జ కోన రూపొందించిన ఈ చిత్రంలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ స‌ర‌స‌న శ్రీనిధితో పాటు రాశి ఖ‌న్నా కూడా క‌థానాయిక‌గా న‌టించింది. ఈ నెల 17న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.

This post was last modified on October 5, 2025 10:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

35 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago