Movie News

ఉస్తాద్ ఎప్పుడొస్తాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రం.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ‘ఓజీ’ ఎట్టకేలకు గత గురువారం విడుదలైంది. హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోయినా.. అభిమానులకు సినిమా తెగ నచ్చడంతో వీకెండ్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా సినిమా ఓ మోస్తరు కలెక్షన్లతో సాగిపోతోంది. 

పవన్‌కు ఇదే తొలి వంద కోట్ల షేర్ చిత్రం. ప్రస్తుతం షేర్ రూ.170 కోట్లకు చేరువగా ఉంది. ఫుల్ రన్లో బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చేలాగే కనిపిస్తున్నారు. అంతిమంగా ‘ఓజీ’కి మంచి ఫలితం వచ్చినట్లే. ఇక పవన్ నుంచి వాట్ నెక్స్ట్ అన్నది ప్రశ్న. ఆయన చేతిలో ఇంకొక్క సినిమానే ఉంది. అదే.. ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించి పవన్ చిత్రీకరణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరి రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

పవన్ తన పార్ట్ వరకు చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ.. ఇంకా కొంత షూట్ మిగిలే ఉంది. అది మరి కొన్ని వారాల్లో పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ మరీ కష్టమేం కాదు. టైం పట్టేది కాదు. సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే డిసెంబరుకు కూడా రెడీ చేయొచ్చు. కానీ కేవలం రెండు నెలల గ్యాప్‌లో పవన్ సినిమాలు రెండు రిలీజైపోయాయి. కాబట్టి ఈసారి గ్యాప్ కోరుకుంటున్నారు. సంక్రాంతికి ఎలాగూ ఖాళీ లేదు. కాబట్టి ఇక ఉన్న ఆప్షన్ వేసవే. 

ఆ సీజన్లో చరణ్ నుంచి ‘పెద్ది’, చిరంజీవి నుంచి ‘విశ్వంభర’ రాబోతున్నాయి. ‘పెద్ది’ మార్చి 26కు షెడ్యూల్ అయింది. అది పక్కాగా అప్పుడే వచ్చేట్లయితే.. దీనికి, చిరు సినిమాకు.. ‘ఉస్తాద్’ నుంచి కనీసం మూడు మూడు వారాల గ్యాప్ ఉండేలా దాని రిలీజ్ డేట్ ప్లాన్ చేయబోతున్నారు. పవన్ గత చిత్రాలతో పోలిస్తే రిలీజ్ డేట్ విషయంలో ‘ఉస్తాద్’ టీం హడావుడి పడట్లేదు. నిర్మాతల మీద ఎక్కువ ఒత్తిడి కూడా లేదు. కాబట్టి చరణ్, చిరు చిత్రాల మీద ఫుల్ క్లారిటీ వచ్చే వరకు ‘ఉస్తాద్’ విడుదల ఖరారవదు. కావాల్సినంత టైం ఉంది కాబట్టి క్వాలిటీ పర్ఫెక్ట్‌గా చూసుకుని.. అవసరమైతే రీషూట్లు కూడా చేసుకుని తాపీగా వేసవి చివర్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది.

This post was last modified on October 5, 2025 12:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago