బాక్సాఫీస్ వద్ద బలంగా దూసుకుపోతున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఆశించిన దానికన్నా పెద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం హోంబాలే ఫిలిమ్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. మొదటి రోజే తొంబై కోట్ల దగ్గరకు వెళ్ళిపోయిన ఈ డివోషనల్ డ్రామా వీకెండ్ బుకింగ్స్ తో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తోంది. అయితే బుక్ మై షోలో చూపిస్తున్న నెంబర్స్ నిజమా కదా అనే దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్లు జరుగుతున్నాయి. గంటకు బుక్ అవుతున్న టికెట్లకు, ఫైనల్ గా రోజు చివరిలో నమోదవుతున్న గ్రాస్ కి లంకె కుదరడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంతనేది ఇప్పట్లో తెలియకపోవచ్చు.
కాకపోతే కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ స్ట్రాంగ్ గా ఉన్న మాట వాస్తవం. కర్ణాటకలో వసూళ్లు భీభత్సంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ ఏపీ, తెలంగాణలో అత్యధిక షోలు హౌస్ ఫుల్స్ నడుస్తూ ఉండటం గమనించాల్సిన విషయం. అయితే ఇంత దూకుడుగా ఉన్నా ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కు అందుకుంటుందా అంటే అనుమానమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే కాంతారకు ఈసారి హిందీ ప్రేక్షకుల మద్దతు పూర్తి స్థాయిలో దక్కలేదు. ఫస్ట్ పార్ట్ కి కనెక్ట్ అయినంతగా దీన్ని దగ్గరకు తీసుకోలేకపోతున్నారని నెంబర్లు చూస్తే అర్థమవుతోంది. సండే పికప్ ఉన్నా సోమవారం ఉంచి డ్రాప్స్ ఆందోళనకరంగా ఉండొచ్చు.
నార్త్ అమెరికాలోనూ కాంతారకు బ్రహ్మరథం లేదు. వన్ మిలియన్ దాటేసింది కానీ టార్గెట్ గా పెట్టుకున్న టెన్ మిలియన్ మార్క్ అందుకోవాలంటే ఇప్పుడున్న ట్రెండ్ సరిపోదు. అమాంతం పికప్ కనిపించాలి. కానీ ఎన్ఆర్ఐలు ఓజిని నెత్తిన బెట్టుకున్నంత వేగంగా కాంతార చాప్టర్ 1ని స్వంతం చేసుకోలేకపోయారనేది అంకెలు చెబుతున్న సాక్ష్యం. ఇండియా వరకు చూసుకున్నా కాంతార అయిదు వందల కోట్లు దాటడం ఖాయమే. కాకపోతే అటుపై ఎక్కడ ఆగుతుందనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే వెయ్యి కోట్ల మైలురాయి ఏ మాత్రం ఈజీ కాదు.
This post was last modified on October 4, 2025 10:09 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…