హీరో, నటుడు శ్రీకాంత్ వారసుడిగా తెరకు పరిచయమిన రోషన్ మేక తెరంగేట్రం జరిగి అయిదు సంవత్సరాలయ్యింది. 2021 పెళ్లి సందడి రిలీజయ్యాక మళ్ళీ కుర్రాడు తెరమీద కనిపించలేదు. స్వప్న సినిమాలో ఛాంపియన్ అంగీకరించాక వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా దాని కోసమే కష్టపడుతున్నాడు. నాలుగు నిర్మాణ సంస్థలు పాలు పంచుకుంటున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద నిర్మాత అశ్వినీదత్ యాభై కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దర్శకుడు ప్రదీప్ అద్వైతం మీద నమ్మకంతో ఎంత కాలయాపన జరుగుతున్నా సరే పట్టు వదలకుండా చిత్రీకరణ చేస్తూనే ఉన్నారు. రిలీజ్ ఎప్పుడో ఫైనల్ కాలేదు.
ఒక పక్క కుర్రహీరోల మధ్య కాంపిటీషన్ పెరిగిపోతోంది. రోషన్ పేరుతోనే ఉన్న సుమ, రాజీవ్ కనకాల కొడుకు అప్పుడే రెండో మూవీ మోగ్లీతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద సంస్థ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సోషల్ మీడియా స్టార్ లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి చేతిలో నాలుగు సినిమాలున్నాయట. రోషన్ మేకతో పాటే పరిచయమైన హీరోయిన్ శ్రీలీల ఆల్రెడీ డబుల్ డిజిట్ చిత్రాలు పూర్తి చేసి మంచి బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇలా తన సమకాలీకుల్లో దూసుకుపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ లో నెగ్గి ఛాంపియన్ కావాలంటే కుర్రాడు స్పీడ్ పెంచాల్సిందే.
హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలనుతో ఒక ప్రాజెక్ట్ లాకైయ్యిందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. మోహన్ లాల్ భారీ బడ్జెట్ చిత్రం వృషభలోనూ నటించిన రోషన్ మేక అది కూడా ఆలస్యమవుతూ ఉండటం వల్ల వెయిటింగ్ లో ఉన్నాడు. ఈ దీపావళికి మోక్షం దక్కేలా ఉంది. అయిదేళ్ల కాలంలో రోషన్ ఇంత నెమ్మదిగా ఉండటం ఏ మాత్రం సేఫ్ కాదు. ఒక సినిమా మీద గట్టి నమ్మకం ఉంచుకోవడం మంచిదే. అలాని కాలాన్ని కర్పూరంలా కరిగించుకుంటూ పోతే పక్కోళ్లు రేస్ లో ముందుకు వెళ్ళిపోతారు. అందుకే అర్జెంట్ గా నడక నుంచి పరుగుకు మారాలి.
This post was last modified on October 4, 2025 9:27 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…