వార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో చెప్పనక్కర్లేదు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మొదటి కలయిక కావడంతో ఈ మల్టీస్టారర్ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక అండర్ కుక్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వడంతో కనీసం యావరేజ్ కూడా కాలేకపోయింది. తారక్ కి నెగటివ్ షేడ్ పెట్టి చివరిలో పాజిటివ్ గా మార్చి ఏదేదో చేశారు. అదే తెలుగు ఆడియన్స్ కోణంలో పెద్ద మైనస్ అయ్యింది. ఆగస్ట్ 14 విడుదలైన వార్ 2 ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. ఇంకో అయిదు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న నేపథ్యంలో హృతిక్ ఒక పోస్ట్ పెట్టాడు.
ప్రతి సినిమాలాగే కబీర్ పాత్రలో వంద శాతం కష్టపడ్డానని, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో బాగా చూసుకున్నాడని, చాలా ఉత్సాహంగా రాజీ పడకుండా చిత్రీకరణ జరిగిందని, అయినా ఫలితాలు ప్రతిసారి మన చేతిలో ఉండవని సుదీర్ఘమైన సందేశం పెట్టాడు. అయినా అందరూ మర్చిపోయిన గాయాన్ని ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నావ్ కబీర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మాములుగా నెట్ ఫ్లిక్స్ లో ఏదైనా పెద్ద సినిమా వస్తున్నప్పుడు అందులో లీడ్ యాక్టర్స్ ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వీటిని ముందే షూట్ చేసి ఓటిటి రిలీజ్ టైంలో వదులుతారు. కానీ హృతిక్ వెరైటీగా ప్రమోట్ చేస్తున్నాడేమో.
ఏదేమైనా వార్ 2 అయిపోయిన గతం. ఇలా తవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం కానీ సానుభూతి కానీ ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ దీని గురించి గత రెండు నెలల్లో ఎక్కడా స్పందించలేదు. పలు సందర్భాల్లో బయటికి వచ్చినా, కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ మొదలయ్యాక బహుశా ఒకటి రెండు వీడియోలు రావొచ్చు. వార్ 2 వల్లే మళ్ళీ సౌత్, నార్త్ స్టార్లు కలిసి నటించే మల్టీస్టారర్స్ ఇప్పట్లో రాకపోవచ్చనే అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో అసలు వార్ 3 అయినా ఉంటుందా లేదా అనే దాని మీద రకరకాల అనుమానాలు నెలకొన్నాయి.
This post was last modified on October 4, 2025 2:36 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…