తెలుగు సినిమా షూటింగులు మళ్లీ మొదలయితే అయ్యాయి కానీ ఊహించనంత వేగమయితే లేదు. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులతో ఏకధాటి షూటింగులు పెట్టుకోకుండా పది, పదిహేను రోజుల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో వేసవికి విడుదలవుతాయని అనుకున్న పెద్ద సినిమాలు కొన్ని అప్పటికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య చిత్రం వేసవికి విడుదల కాదట. ఈ చిత్రం కోసం చిరంజీవి, చరణ్ కలిసి నటించే సన్నివేశాలను సంక్రాంతి తర్వాత చిత్రీకరిస్తారట. ఇంకా చాలా భాగం షూటింగ్ పూర్తి కావాల్సి వుంది కనుక మే నెలలో విడుదల చేయడం కుదరదని, కనుక హడావిడి లేకుండా ఈ చిత్రాన్ని దసరా రిలీజ్‍కి ప్లాన్ చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారట.
అలాగే ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కూడా మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి వుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆ చిత్రం కూడా దసరా బరిలోకే వెళుతుందని చెప్పుకుంటున్నారు.
వేసవిలో వకీల్ సాబ్, నారప్ప, టక్ జగదీష్, లవ్‍స్టోరీ తదితర చిత్రాలు మాత్రమే ఖాయంగా విడుదలవుతాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమా కూడా వేసవి తర్వాతే రావచ్చునని సంకేతాలు అందుతున్నాయి. పుష్ప, సర్కారు వారి పాట దసరాకి కూడా రాకపోవచ్చునని అంచనా.
This post was last modified on November 27, 2020 1:47 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…