కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మీద ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఒక డివైన్ ఎమోషనల్ డ్రామా అద్భుతంగా హ్యాండిల్ చేశారంటూ విమర్శకులు మెచ్చుకున్నారు. కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఇలా హీరో దర్శకుడిగా రెండు పాత్రలను గొప్పగా పోషించిన రేర్ టాలెంట్ గా పొగడ్తల వర్షం కురిపించడం, ఇప్పటిదాకా ఎవరికీ ఇది సాధ్యం కాలేదనే రీతిలో ఆకాశానికి ఎత్తడం మూవీ లవర్స్ ని ఫ్లాష్ బ్యాక్ తవ్వేలా చేస్తోంది. ఎందుకంటే ఇలా రెట్టింపు బాధ్యతల్లో మెప్పించిన గొప్ప కథానాయకులు మన టాలీవుడ్ లోనే ఎందరో ఉన్నారు. ఒక చిన్న లుక్ వేద్దాం.
స్వర్గీయ ఎన్టీఆర్ మొత్తం పదిహేడు సినిమాలకు దర్శకత్వం వహించి ఆల్ టైం క్లాసిక్స్ ఇచ్చారు. ముఖ్యంగా దానవీరశూరకర్ణలో ట్రిపుల్ రోల్ చేసి, డైరెక్షన్ తో పాటు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ కేవలం నలభై అయిదు రోజుల్లో అంత పెద్ద గ్రాండియర్ ని తీసి అనుకున్న టైంకి రిలీజ్ చేయడం ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. దీనికన్నా ముందు తాతమ్మ కలతో మొదలుపెట్టి సీతారామకళ్యాణం, శ్రీ కృష్ణ పాండవీయం, తల్లా పెళ్ళామా లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో కొన్ని ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినవి ఉన్నాయి. మరే ఇతర హీరో ఇంత గొప్ప ఫీట్ సాధించలేకపోయారన్నది వాస్తవం.
తర్వాత చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గురించి. సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం., శంఖారావం, ఇంద్రభవనం లాంటి మర్చిపోలేని సినిమాలు ఎన్నో ఇచ్చారు. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇదే క్యాటగిరీలోకి వస్తారు. యాక్టింగ్, డైరెక్షన్ తో పాటు సంగీతం లాంటి అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. అర్ధరాత్రి స్వతంత్రం, దండోరా, ఎర్ర సైన్యం, చీమలదండు లాంటి ఎన్నో విప్లవాత్మక చిత్రాలు వచ్చాయి. కొత్త తరంలో ఇన్ని రిస్కులు చేసిన వాళ్ళు తక్కువ కానీ ధనుష్ లాంటి వాళ్ళు తమదైన ముద్ర వేయగలిగారు. సో రిషబ్ శెట్టి ఘనత గొప్పదే కానీ ఎందరో మహానుభావులు అందరికీ మహానుభావులు.
This post was last modified on October 3, 2025 9:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…