రాబోయే రోజుల్లో టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన ఈ కుర్రాడు.. సినిమాల్లోకి అడుగు పెట్టకముందే బంపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నేళ్లుగా తన పుట్టిన రోజు వస్తే సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఆ స్థాయిలో అభిమానులు తన పేరును ట్రెండ్ చేస్తున్నారు. అకీరా ఎప్పుడైనా బయటికి వస్తే తన పొటోలు వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడే ఇంత క్రేజ్ తెచ్చుకున్న అకీరా.. ఇక సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తన అరంగేట్రం కోసం మెగా అభిమానులు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హీరోగా చేయడానికి ముందే ఓజీ సినిమాలో అకీరా క్యామియో రోల్ చేస్తున్నట్లుగా విడుదల ముంగిట జోరుగా ప్రచారం జరిగింది. ఐతే అది నిజం కాలేదు. కానీ అకీరాను ఇందులో నటింపజేసే విషయం గురించి టీంలో చర్చ జరిగిందట. ఈ విషయాన్ని సినిమాలో యంగ్ పవన్ కళ్యాణ్ రోల్‌లో కనిపించిన ఆకాష్ శ్రీనివాస్ అనే కుర్రాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఓజీలో యంగ్ పవన్ కళ్యాణ్ సీన్ కాసేపే ఉన్నా అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఈ పాత్రను అకీరా చేసి ఉంటే పేలిపోయేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ పాత్ర చేసిన ఆకాష్‌కు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందట. ఆ విషయాన్ని దర్శకుడు సుజీత్‌తో కూడా చెప్పాడట. ఐతే ఈ పాత్రను అకీరాతో చేయించడానికి తన హైటే సమస్య అని సుజీత్ చెప్పాడట.
అకీరా దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తుంటాడు. తండ్రి కంటే అతను చాలా పొడవు. అలాంటపుడు కుర్రాడిగా ఉన్న ఓజాస్ గంభీర అంత హైట్ ఉండి.. పెద్దయ్యాక పొడవు తగ్గిపోతే లాజిక్ మిస్సవుతుంది కదా? ఆ ఉద్దేశంతోనే అకీరాతో ఆ పాత్ర చేయించలేదని సుజీత్ ఆకాష్‌కు చెప్పాడట. అకీరా ఆ క్యామియో చేస్తే బాగుండేది కానీ.. తన అరంగేట్రానికి ఇది సరైన సినిమా కాదన్నది మెజారిటీ అభిమానుల మాట. అతను ఫుల్ లెంగ్త్ హీరోగానే ఎంట్రీ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత తన డెబ్యూ మూవీ తెరపైకి రావచ్చేమో.
This post was last modified on October 1, 2025 1:51 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…