Movie News

కాంతార… హైప్ అంతా ఏమైంది?

మూడేళ్ల ముందు కన్నడ సినిమా కాంతార ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, ఇతర భాషల వాళ్లలోనూ ఆసక్తి రేకెత్తించింది. కన్నడ వెర్షన్‌నే ఇండియాలోని మేజర్ సిటీస్‌లో ఇతర భాషల వాళ్లు కూడా ఎగబడి చూస్తుండడంతో వెంటనే సినిమాను డబ్ చేసి ఆయా భాషల్లో రిలీజ్ చేశారు. 

తెలుగులో, హిందీలో, తమిళంలో ఈ సినిమా అద్భుత విజయాన్నందుకుంది. ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. దీంతో దీని సీక్వెల్‌ ‘కాంతార: చాప్టర్-1’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఈసారి హోంబలె ఫిలిమ్స్ వాళ్లు పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి భారీ విజన్‌తో సినిమాను తెరకెక్కించాడు. రిలీజ్ ముంగిట వరకు ఈ సినిమా నుంచి ప్రోమోలేవీ రిలీజ్ కాలేదు. కానీ సినిమాకు హైప్ విషయంలో ఢోకా లేనట్లే కనిపించింది. ఐతే ‘కాంతార: చాప్టర్-1’ ట్రైలర్ విషయంలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.

ట్రైలర్లో భారీతనం ఉన్నా.. కథ ఒక టెంప్లేట్ ప్రకారం సాగిపోయేలా కనిపించింది. ‘కాంతారా’లో మాదిరి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇందులో ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయి. ఐతే ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ.. సినిమాకు బుకింగ్స్ గట్టిగానే జరుగుతాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు. కానీ వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు కానీ.. మిగతా చోట్ల ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా ‘కాంతార’ను గొప్పగా ఆదరించిన హిందీ ఆడియన్స్.. ‘కాంతార: చాప్టర్-1’ మీద ప్రస్తుతానికి అంతగా ఆసక్తి ప్రదర్శించట్లేదు. బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి. 

హిందీ ఆడియన్స్ దక్షిణాది ప్రేక్షకుల్లా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎగబడరు అన్నది వాస్తవం. తొలి రోజే. తొలి వీకెండ్లోనే సినిమా చూసేయాలన్న ఆతృత వారిలో కనిపించదు. వాకిన్స్ ఎక్కువగా ఉంటాయి. అయినా సరే.. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక మోస్తరుగా అయినా ఉండాలి. కానీ టికెట్ల అమ్మకాలు మరీ నామమాత్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ మొదలు కాలేదు. ఇక్కడ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కొన్ని వివాదాలు, అధిక టికెట్ల ధరల వల్ల తెలుగులో కొంచెం నెగెటివిటీ ముసురుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసేందుకు మరీ ఎగబడే పరిస్థితి అయితే లేదు. టాక్ ఎలా ఉంటుందన్నదాన్ని బట్టే సినిమా ఫలితమేంటో తేలనుంది. ఈ చిత్రానికి ముందు అనుకున్న స్థాయిలో అయితే ఓపెనింగ్స్ రావనిపిస్తోంది.

This post was last modified on September 30, 2025 1:56 pm

Share

Recent Posts

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

20 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

39 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago