Movie News

ఇడ్లీలు… అక్కడ వేడిగా ఇక్కడ చల్లగా

రేపు ధనుష్ ఇడ్లి కొట్టు విడుదలవుతోంది. తెలుగులో సౌండ్ లేదు. మొన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కరూర్ విషాదంలో నలభై మంది ప్రాణాలు కోల్పోవడంతో దానికి నివాళిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. టైం తక్కువగా ఉండటంతో మళ్ళీ ప్రమోషన్లు చేసే అవకాశం లేకపోయింది. మాములుగా ధనుష్ తెలుగు వెర్షన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. సార్, రాయన్, కుబేర టైంలో చాలా యాక్టివ్ గా పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ ఇడ్లి కొట్టు విషయంలో ఆ ఛాన్స్ దొరకడం లేదు. దీంతో ఏపీ తెలంగాణ జనాల్లో పెద్దగా బజ్ కనిపించడం లేదు. ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ నామమాత్రంగా ఉన్నాయి.

తమిళనాడులో ఇడ్లి కడైగా విడుదలవుతున్న ఈ ఎమోషనల్ డ్రామాకు ముందస్తు టికెట్ల అమ్మకాలు బాగానే ఊపందుకుంటున్నాయి. సగటున గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా టికెట్లు అమ్ముడుపోవడం మంచిదే. కానీ తెలుగులో కనీసం ట్రెండింగ్ లోకి రాలేదు. నేటివిటీ సమస్య వల్ల టాలీవుడ్ జనాలు వేగంగా కనెక్ట్ కాలేకపోతున్నారనేది సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి చెప్పొచ్చు. కథంతా అరటిపండు వలిచినట్టు చెప్పేయడంతో టాక్ వచ్చాక చూద్దాం లెమ్మనే జనాలు ఎక్కువగా ఉంటారు. పైగా ఒక రోజు గ్యాప్ తో కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుండటం కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ప్రభావం చూపిస్తోంది.

స్వీయ దర్శకత్వంలో ఇడ్లి కొట్టు తీసిన ధనుష్ ఈసారి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉన్నాడు. పల్లెటూరు, ఇడ్లిలు అమ్ముకునే ఒక చిన్న కుటుంబం, అందమైన భావోద్వేగాలు, గ్రామీణ మట్టి వాసన, కల్లాకపటం లేని అనుబంధాలు ఇలా పూర్తిగా క్లాస్ సైడ్ వెళ్ళిపోయాడు. కంటెంట్ పరంగా చాలా గట్టి నమ్మకమే చూపిస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఇడ్లి కొట్టులో ‘సాహో’ అరుణ్ విజయ్ విలన్ గా నటించగా సత్యరాజ్, పార్తీబన్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మరోసారి పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలో నిత్య మీనన్ హీరోయిన్ గా చేసింది.

This post was last modified on September 30, 2025 10:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

39 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

43 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

46 minutes ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

54 minutes ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

1 hour ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

1 hour ago