అనుకున్నట్టే కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎంతనేది ఇంకా అధికారికంగా బయటికి చెప్పలేదు కానీ ప్రతి టికెట్ మీద 75 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉండొచ్చని సమాచారం. తెలంగాణలో ఆ ఛాన్స్ లేదు. ఓజికి ఇచ్చిన హైక్స్ వల్ల కోర్టు ఇచ్చిన ట్విస్టుతో అప్పటికప్పుడు ధరలు సవరించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరికి స్పెషల్ పర్మిషన్లు, పెంపులు ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే చెప్పిన నేపథ్యంలో కాంతారా ఒకవేళ హైక్ అడిగినా ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు.
సరే కాంతార విషయంలో కళను కళగా చూడాలి తప్ప ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేయకూడదని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్దేశం మంచిదే అయినా ఇక్కడ ఒక కోణాన్ని మాత్రం సీరియస్ గా చూడాలి. కాంతార ఒక డబ్బింగ్ మూవీ. మన రాష్ట్రంలో షూటింగ్ చేయడం, తెలుగు ఆర్టిస్టులను తీసుకోవడం కానీ చేయలేదు. ఆ మాటకొస్తే నేటివిటీ కూడా కన్నడనే. పంజుర్లి గ్రామ దేవత మనకు పరిచయం లేని పేరు. అయినా ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయి ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ చేశాం. అంతమాత్రాన కాంతార మనది అయిపోదు కదాని మూవీ లవర్స్ క్వశ్చన్. దాంట్లో న్యాయం, లాజిక్ రెండూ ఉన్నాయి.
ఇటీవలే ఓజి ప్రీమియర్లకు బెంగళూరులో కొందరు కన్నడ మద్దతుదారులు పెద్ద రచ్చ చేశారు. బ్యానర్లు చించేసి గొడవ చేయడం ఇప్పుడేమి కొత్తగా జరగలేదు. ఆర్ఆర్ఆర్ నుంచి రిపీట్ అవుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు కాంతారా మీద ప్రత్యేక ప్రేమ ఏమిటనేది సినీ ప్రియుల ప్రశ్న. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రికి పవన్ కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు వాళ్లే. అందుకే అడిగి ఉండొచ్చు. అసలే జ్వరంతో బాధ పడుతున్న పవన్ కళ్యాణ్ ఇంత లోతుగా అలోచించి ఉండరని, సినిమా బాష ఏదైనా అందరికి చేరువ కావాలనే ఉద్దేశంతో పెంపు ఇచ్చేసి ఉండొచ్చని ఫ్యాన్స్ వెర్షన్. నిజమేనేమో.
This post was last modified on September 29, 2025 10:55 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…