స్పెషల్ సాంగుతో ఊపు తేవాలి

బాక్సాఫీస్ ని టేకోవర్ చేసుకున్న ఓజిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ వల్ల నేహా శెట్టి ఐటెం సాంగ్ లేకపోవడం అభిమానులకు పెద్ద లోటు అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అదనపు ఆకర్షణగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. నిర్మాతలు దానికి రెడీ అవుతున్నారు. తాజాగా తమన్ ఇస్తున్న ఇంటర్వ్యూలలో దీని ప్రస్తావన వస్తోంది. సోమవారం లేదా అటుపై ఏదో ఒక రోజు యాడ్ చేస్తారని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఆదివారం షోల నుంచే జోడిస్తారనే ప్రచారం జరిగింది కానీ అక్టోబర్ 1 లేదా ఇంకో రెండు మూడు రోజులు అటుఇటు పెట్టడమైతే కన్ఫర్మ్. కాకపోతే డివివి టీమ్ నుంచి ప్రమోషన్ రూపంలో ప్రకటన వస్తుంది.

ఇప్పుడు నేహశెట్టి సాంగ్ పెట్టినంత మాత్రాన కలెక్షన్లు అమాంతం పెరగవు కానీ ఇప్పటిదాకా సినిమా చూడనివాళ్లకు స్పెషల్ బోనస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం లాంటివేవీ ఈ పాటలో ఉండవని అంటున్నారు. స్క్రీన్ మీద చూస్తే తప్ప క్లారిటీ రాదు. బ్యాంకాక్ లో షూట్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ లో నేహశెట్టి డాన్సులు ప్రత్యేకంగా మెప్పిస్తాయని ఇన్ సైడ్ టాక్. గబ్బర్ సింగ్ కెవ్వు కేక రేంజ్ లో ఊహించుకోకుండా న్యూట్రల్ గా చూస్తే నచ్చుతుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్లేస్ మెంట్ సాధ్యం కాదు కాబట్టి సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ కు ముందు పెట్టే ఆలోచన చేస్తున్నారట.

ఇప్పుడు ఓజి ముందున్న తక్షణ కర్తవ్యం వీక్ డేస్ లో టికెట్ రేట్లు తగ్గించడం. కానీ బుక్ మై షోలో చూస్తే జిఓ ప్రకారం పెంచిన ధరలే ఉన్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో దసరా పండగ వస్తోంది కాబట్టి ఆక్యుపెన్సీలు పెద్ద ఎత్తున ఉంటాయి కనక పెంపుని కొనసాగించే దిశగా డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి మార్పులు చేయలేదని వినికిడి. అక్టోబర్ 2 కాంతార చాప్టర్ 1 వస్తున్న నేపథ్యంలో ఓజికి అది ఎలాంటి పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ధనుష్ ఇడ్లి కొట్టు కూడా రేస్ లో ఉన్నప్పటికీ తెలుగు ఆడియన్స్ కి ట్రైలర్లు, ప్రమోషన్లు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక బజ్ లో మార్పు రావొచ్చు.