Movie News

వింటేజ్ మోహన్ బాబుని బయటికి తెచ్చారు

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ లో మోహన్ బాబు విలన్ గా చేస్తున్నారనే వార్త నెలల క్రితమే లీకయ్యింది. కాకపోతే అఫీషియల్ గా దానికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఇవాళ దానికి క్లారిటీ వచ్చేసింది. కలెక్షన్ కింగ్ ని చొక్కా లేకుండా, చేతి నిండా రక్తంతో పాటు మెషీన్ గన్లు పట్టుకున్న లుక్ ని రివీల్ చేశారు. ఎప్పుడో 90 దశకంలో మోహన్ బాబు ఇలా షర్ట్ లెస్ గా కనిపించేవారు. విలన్ గా, హీరోగా చేసినవాటిలో చూడొచ్చు. రాయలసీమ రామన్నచౌదరి లాంటివి ఫ్యాన్స్ కి బాగా గుర్తుంటాయి.

మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఇంత మాస్ గా మారిపోవడం ప్యారడైజ్ మీద ఆసక్తి పెంచుతోంది. ఇప్పటికే కిల్ ఫేమ్ రాఘవ్ జుయెల్ ఒక విలన్ గా చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ప్రతినాయకుడిని బయటికి తేవడంతో వీళ్ళతో నాని క్లాష్ ఎలా ఉండబోతోందనేది ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 26 విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ కేవలం ఒక రోజు గ్యాప్ లో పెద్ది ఉన్నప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్యాన్ ఇండియా మూవీస్ లో ఏది మాట మీద ఉంటుందో ఏది తప్పుతుందో చెప్పలేం కాబట్టి చరణ్ వర్సెస్ నాని క్లాష్ అయితే ఉన్నట్టే.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం మోహన్ బాబు కెరీర్ లోనే అత్యంత హింసాత్మక పాత్రగా శ్రీకాంత్ ఓదెల దీన్ని డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. నెరేషన్ విని ఆశ్చర్యపోయి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శారీరక శ్రద్ధ తీసుకుని మరీ రెడీ అయ్యారట. చేతిలో ఉన్న అయిదు నెలలు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రన్నింగ్ రేస్ చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ ఒత్తిళ్లు లేకుండా ఫిబ్రవరికల్లా మొత్తం పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్టు తెలిసింది. కాకపోతే టైంకి అనిరుధ్ రవిచందర్ పని చేయించుకోవడమే కాదు బెస్ట్ రాబట్టుకునేందుకు కష్టపడాల్సి ఉంటుంది. అతని ఫ్లాపుల పర్వానికి బ్రేక్ వేయాల్సింది ప్యారడైజే.

This post was last modified on September 27, 2025 12:53 pm

Share

Recent Posts

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

47 minutes ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

2 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

2 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

2 hours ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

4 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

6 hours ago