రేపు జనవరి నెలతో హనుమాన్ వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోతాయి. హీరో తేజ సజ్జ నుంచి మిరాయ్ వచ్చింది కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మరో సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అన్నీ ఓకే అనుకున్నాక ఆగిపోవడం ఊహించని ట్విస్టు. ఒకవేళ అనుకున్నట్టే సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికో పాతిక శాతం పూర్తయ్యేది. రణ్వీర్ సింగ్ తో బాలీవుడ్ సినిమా సైతం ఫోటో షూట్ తర్వాత క్యాన్సిల్ కావడం ఇంకో పరిణామం. ఇన్ని హెచ్చుతగ్గుల మధ్యలోనూ ప్రశాంత్ వర్మ తన నిర్మాణ పర్యవేక్షణలో మహా కాళీ, అధీర అనే రెండు సూపర్ హీరో మూవీస్ తీస్తున్నాడు.
ఇక ప్రశాంత్ వర్మ భుజాల మీద ఉన్న అతి పెద్ద బాధ్యత జై హనుమాన్. ప్రకటించి నెలలు గడిచిపోతున్నప్పటికీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళకపోవడంతో ఫ్యాన్స్ అనుమానపడిన సందర్భాలు లేకపోలేదు. కాంతార చాప్టర్ 1 ప్రమోషన్లలో హీరో రిషబ్ శెట్టి దానికి క్లారిటీ ఇచ్చాడు. కాంతార మీద పూర్తి దృష్టి పెట్టడం వల్ల పారలల్ గా జై హనుమాన్ చేసే అవకాశం లేకపోయిందని, స్క్రిప్ట్ చెప్పినప్పుడు తాను స్పెల్ బౌండ్ అయ్యానని, ఎప్పుడెప్పుడు మొదలుపెట్టాలని ఎదురు చూస్తున్నానని అన్నాడు. అంటే ఇంకో నెల రెండు నెలల్లో స్టార్ట్ కావొచ్చు. అయితే జై హనుమాన్ కోసం కాస్త ఎక్కువ నిరీక్షణ తప్పేలా లేదు.
ఎందుకంటే అక్టోబర్ లేదా నవంబర్ లో జై హనుమాన్ చిత్రీకరణ మొదలైనా పూర్తయ్యేనాటికి కనీసం ఏడాది పడుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్లు, విఎఫ్ఎక్స్ లు, మార్కెటింగ్, ప్రమోషన్లు వగైరాలు ఎక్కువ సమయం డిమాండ్ చేస్తాయి. అంటే 2027 సంక్రాంతికి కూడా డౌటే. పైగా రిషబ్ శెట్టి కేవలం జై హనుమాన్ కు మాత్రమే కమిట్ మెంట్ ఇవ్వలేదు. ఛత్రపతి శివాజీతో పాటు మరో రెండు పీరియాడిక్ మూవీస్ కి ఓకే చెప్పాడు. వీటిలో ఏది ముందు ఏది వెనుక అనేది ఇంకా సస్పెన్సే. మైత్రి మూవీ మేకర్స్ జై హనుమాన్ కోసం భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీగా ఉంది. ఒక స్టార్ హీరోతో రాముడి వేషం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
This post was last modified on September 26, 2025 9:15 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…