భారీ పారితోషకాలు పుచ్చుకునే సినీ స్టార్లకు ఏం సమస్యలుంటాయిలే.. వాళ్ల జీవితం అంతా పూల పాన్పు అనుకుంటాం. కానీ వాళ్లలో కూడా వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కొనే వాళ్లుంటారు. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన లవ్ లైఫ్ ఎప్పుడూ సజావుగా సాగలేదు. వేర్వేరు వ్యక్తులతో ప్రయత్నించినా.. ఏ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరగా రొమేనియా భామ లులియా వాంటూర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వీరి బంధం గురించి ఏ న్యూస్ లేదు.
60 ఏళ్లు దగ్గర పడుతున్నప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోయాడు సల్మాన్. ఎక్కువ కాలం నిలబడని బంధాలకు తోడు.. తనకున్న ఆరోగ్య సమస్యలు కూడా సల్మాన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలని అంటారు. కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న టీవీ షోలో అతను తన సమస్యల గురించి చెప్పిన మాటలు అభిమానులను కదిలించేశాయి.
సల్మాన్‌కు ఏడున్నరేళ్లుగా ట్రిగెనిమల్ న్యూరాల్జియా అనే వ్యాధితో పోరాడుతున్నాడట. అది నరాలకు సంబంధించిన సమస్య. దీని వల్ల ప్రతి నాలుగైదు నిమిషాలకు ముఖంలో నొప్పి మొదలవుతుందట. దీని కోసం రోజూ పెయిన్ కిల్లర్లు వాడాల్సి వస్తుందట. నొప్పి తగ్గించుకోవడానికి సల్మాన్ ఒక క్రిటికల్ సర్జరీ కూడా చేసుకున్నాడట. దాంతో నొప్పి పూర్తిగా తగ్గిందని సల్మాన్ తెలిపాడు. ట్రిగెనిమల్ న్యూరాల్జియా వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయట. ఈ సమస్య వల్ల సుసైడ్ చేసుకునే కేసులు పెద్ద సంఖ్యలోనే ఉంటాయని సల్మాన్ వెల్లడించాడు.
ఈ జబ్బుతో పోరాడుతూనే విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ సాగినట్లు సల్మాన్ తెలిపాడు. తనకున్న ఈ సమస్య గురించి ఇప్పుడు బహిర్గతం చేయడానికి కారణం.. ఆ జబ్బు గురించి జనాల్లో అవగాహన పెంచడమే అని.. ఒకప్పటితో పోలిస్తే చికిత్స ఎంతో మెరుగైందని.. పూర్తిగా నివారించడం సాధ్యమే అని సల్మాన్ అంటున్నాడు. మొత్తానికి ఒక తీవ్ర సమస్యతో సల్మాన్ ఏడున్నరేళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on September 25, 2025 5:49 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…